Share News

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:39 PM

త్వరలో జరగ నున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వ తాలు అన్నారు.

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు

- 30 ఎంపీటీసీ స్థానాలు, 7 జడ్పీటీసీ స్థానాల్లో సీపీఎం పోటీ

- పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు

కొల్లాపూర్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరగ నున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వ తాలు అన్నారు. మండలంలోని ముక్కిడిగుండం గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావే శంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరం తరం పోరాడుతున్న ఎర్ర జెండాకు ప్రజలు మ ద్దతుగా నిలవాలని, పార్టీ అభ్యర్థులను గెలిపిం చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రశ్నించే ఎర్రజెండా నాయకులను గెలిపించు కుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావే శంలో మండల కార్యదర్శి శివవర్మ, నాయకులు తారాసింగ్‌, అశోక్‌, బాలు నాయక్‌, బాలపీర్‌, కృష్ణయ్య, కాసీం, శివకుమార్‌, బాష, సాయికృష్ణ, అంజి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:39 PM