Share News

kumaram bheem asifabad- పల్లె పోరుకు రె‘ఢీ‘

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:15 PM

జిల్లాలో పల్లె పోరుకు ఆశావహలు సిద్ధమయ్యా రు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి పంచాయతీ ఎన్నికలు కావడంతో అధికార పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.

kumaram bheem asifabad- పల్లె పోరుకు రె‘ఢీ‘
లోగో

- గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు

- సర్పంచ్‌, వార్డు సభ్యుల పోటీకి ఆశావహుల ఏర్పాట్లు

- మద్దతుదారులతో సమాలోచనలు

జిల్లాలో పల్లె పోరుకు ఆశావహలు సిద్ధమయ్యా రు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి పంచాయతీ ఎన్నికలు కావడంతో అధికార పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.

ఆసిఫాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన షె డ్యూల్‌ మంగళవారం విడుదల కావడంతో గ్రామా ల్లో ఎన్నికల సందడి నెలకొంది. పోటీ చేయాలన్న ఆశావాహులు ముందుగా తమ మద్దతు దారులతో సమాలోచనలు సాగిస్తున్నారు. తాము పోటి చేస్తే ఎలా ఉంటుంది.. అందరి మద్దతు లబిస్తుందా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఏ ఇద్దరు కలిసిన గ్రామాలలో ఏ పార్టీ మద్దతుతో ఎవరు పోటికి సిద్ధమవుతున్నారనే ఆంశాలపై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జనరల్‌ స్థానా ల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది.

- 15 మండలాల పరిధిలో..

ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 335 గ్రామపంచాయతీలు, 2,874 వార్డు స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్‌ స్థానాలకు ఎస్టీలకు 198, ఎస్సీలకు 32, బీసీలకు 20, జనరల్‌ కేటగిరిలో 85 కేటాయించారు. అలాగే వార్డు స్థానాలకు ఎస్టీలకు 1292, ఎస్సీలకు 226, బీసీలకు 231, జనరల్‌కు 1125 రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. దీంతో పల్లెల్లో రిజర్వేషన్‌ అనుకూలించిన వారు ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు స్థానాలకు పోటి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకొవాలనే అలోచనతో చాలా మంది పోటికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తొంది. మరోపక్క ఒకే పార్టీకి చెందిన మద్దతు దారులు ముగ్గురు, నలుగురు సర్పంచ్‌ స్థానాలను ఆశిస్తుండడంతో తీవ్ర పోటి నెలకొంది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదు కనుక పోటీదారులకు ఎవరు మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

- గెలుపు గుర్రాల వేటలో పార్టీలు..

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టాయి. సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు వివిధ పార్టీల ఆది నాయకులు అచితూచి వ్యవహరిస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలపై ద్వితీయ శ్రేణి నాయకులు భారీ ఆశలు పెట్టుకు న్నారు. బరిలో నిలిచే అయా పార్టీలకు చెందిన ఆశావాహులు అధిష్ఠానం, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలని అంశంపై మండల పార్టీ ప్రతినిధులు, గ్రామాల నేతలతో సమాలో చనలు చేస్తున్నారు.

- నిధుల సమీకరణ...

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం గా ఉన్న ఆశావాహులు నిధుల సమీకరణ చేసే పనిలో పడ్డారు. సర్పంచ్‌ స్థానాలకు గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పదవిని చేజిక్కించుకొవాలని పోటీదారులు కసర త్తు ముమ్మరం చేశారు. దీంతో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిధుల సమీకరణలో నిమగ్నమయ్యారు. అవసరంమేర డబ్బు సమకూ ర్చుకునే పనిలో పడ్డారు. మద్దతుదారులను ప్రస న్నం చేసుకునేందుకు మందు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొన్నది.

Updated Date - Nov 26 , 2025 | 11:15 PM