Share News

kumaram bheem asifabad- వన మహోత్సవానికి సిద్ధం

ABN , Publish Date - Jun 19 , 2025 | 10:35 PM

గ్రామాల్లో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంంగా వన మహోత్సవాన్ని చేపడుతోంది. ఈ మేరకు రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేశారు. జూన్‌ నెలాఖరు నుంచి జూలై వరకు మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

kumaram bheem asifabad- వన మహోత్సవానికి సిద్ధం
నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు

- జిల్లాలో 51 లక్షలు నాటడమే లక్ష్యం

- పక్కాగా అమలుకు అధికారుల సన్నాహాలు

గ్రామాల్లో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంంగా వన మహోత్సవాన్ని చేపడుతోంది. ఈ మేరకు రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేశారు. జూన్‌ నెలాఖరు నుంచి జూలై వరకు మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చింతలమానేపల్లి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో ఈ నెలాఖరులో వనమహోత్సవం నిర్వహిం చేం దుకు అధికారులు మొక్కలు సిద్ధం చేశారు. పచ్చద నం విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్క లు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. గత ప్రభు త్వం హరితాహారం పేరిట తొమ్మిది విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా గతేడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదో విడతలో వర మహోత్సవం పేరిట దీన్ని విజయవం తంగా నిర్వహించింది. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలోని ఆయా జీపీల్లో నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టగా అధికారులు, ప్రజాప్రతి నిధుల భాగస్వామ్యంతో డీఆర్డీఏ, అటవీశాఖల అధికారుల ఆధ్వర్యంలో జూన్‌ చివరి వారం, జూలై మొదటి వారాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.

- సంరక్షణ బాధ్యతలు..

మొక్కల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం గ్రామీ ణాభివృద్ధిశాఖతో ఆయా ప్రభుత్వ శాఖలను అప్ప గించింది. ఈ మేరకు 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీల్లో 51లక్షల మొక్కల పెంపకం పెట్టుకున్నారు. గతేడాది వివిధ శాఖల ఆధ్వర్యంలో 53 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. ప్రస్తుత ఏడాది లక్ష్యం కొంత తగ్గించారు. ఈ మేరకు అవసరమైన మొక్కలు పెంచేందుకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు ఒక్కటి చొప్పున నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచు తున్నారు. గ్రామీణాభివద్ధి శాఖతో పాటు అటవీశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌తో కలిపి వివిధ శాఖల సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ఆద్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలో 2.70 లక్ష్యల మొక్క లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

- రోడ్లకు ఇరువైపులా..

ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలు, రోడ్లకు ఇరువైపు లా ఎక్కువ నీడనిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రణాళి కలు రూపొందిస్తున్నారు. అలాగే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజలను పచ్చదనం, పర్యా వరణ పరిరక్షణ వైపు ప్రోత్సహించనున్నారు. గ్రామ పంచాయతీల ఆద్వర్యంలో ప్రతీ ఇంటికి ఆరు పూలు, పండ్ల మొక్కలు అందించాలని నిర్ణయిం చారు. ప్రజలు ఇంటి ఆవరణలో పెంచుకునేలా గులాభీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరే డు, మునగ, కానుగ, చింత, తులసీ, ఇతర మొక్కలు పంపిణీ చేయనున్నారు.

ఒక్కో నర్సరీలో ఇలా..

జిల్లాలోని ప్రతీ పంచాయతీలో ఒక్కో నర్సరీ ఏర్పా టు చేశారు. సామర్థ్యాన్ని బట్టి 10వేల నుంచి 17 వేల మొక్కల పెంపకం చేపట్టారు. వాతావరణ పరిస్థితు లు, పాలిథిన్‌ సంచుల్లో లోపాలతో కొన్ని మొలకెత్తడం తో వాటి స్థానంలో విత్తనాలు నాటి మొక్కల లక్ష్యాన్ని సాధించారు. జిల్లా వ్యాప్తంగా 51లక్షల మొక్కల పెం పకం లక్ష్యంగా పెట్టుకున్నారు.

గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం ఇలా..

మండలం మొక్కల లక్ష్యం (లక్షల్లో)

ఆసిఫాబాద్‌ 2.70

చింతలమానేపల్లి 2

బెజ్జూరు 2.60

కాగజ్‌నగర్‌ 4

జైనూరు 2

దహెగాం 2.50

కౌటాల 2.50

లింగాపూర్‌ 1.60

రెబ్బెన 2.50

పెంచికలపేట 1.60

వాంకిడి 2.50

తిర్యాణి 2.30

సిర్పూర్‌(యూ) 1.60

సిర్పూర్‌(టీ) 1.80

ప్రభుత్వశాఖల లక్ష్యం (లక్ష్యల్లో)

అటవీశాఖ 7.47

రెవెన్యూ 0.62

వ్యవసాయ 0.65

విద్యాశాఖ 0.4

ఆర్‌అండ్‌బీ 0.10

Updated Date - Jun 19 , 2025 | 10:35 PM