Share News

మునిసిపోల్స్‌కు సమాయత్తం...!

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:38 PM

మునిసి పాలిటీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సన్నద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల వి భజన, ఓటర్ల తుది ముసాయిదా జాబితాను వచ్చే నెల 10న విడుదల చేసేందుకు సోమవారం ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల ఎ న్నికలకు వేగంగా అడుగులు పడుతుండగా, ఆ మేరకు ప్రభుత్వం కూడా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైం ది.

మునిసిపోల్స్‌కు సమాయత్తం...!
మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయం

-షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌

-నేడు వార్డుల వారీగా ఓటర్ల విభజన

-వచ్చే నెల 10న తుది ఓటరు జాబితా విడుదల

-ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు

మంచిర్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మునిసి పాలిటీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సన్నద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల వి భజన, ఓటర్ల తుది ముసాయిదా జాబితాను వచ్చే నెల 10న విడుదల చేసేందుకు సోమవారం ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల ఎ న్నికలకు వేగంగా అడుగులు పడుతుండగా, ఆ మేరకు ప్రభుత్వం కూడా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైం ది. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం గత ఏడా ది జనవరి 26వ తేదీతో ముగిసింది. ఏడాది తరువాత ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాలక వర్గాలు రద్దు కావడంతో ఏడాది కాలంగా ము న్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో పని చేస్తున్నా యి. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలు ముగిసిన తరు వాతనే మున్సిపల్‌ ఎలక్షన్లు నిర్వహిస్తారనే చర్చ గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ, పరిషత్‌ కంటే ముం దే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలో మంచి ర్యాల కార్పొరేషన్‌తోపాటు చెన్నూర్‌, లక్షెట్టిపేట, మంద మర్రి, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మందమర్రి మున్సిపాలిటీ మినహా మిగతా వాటికి ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. మందమర్రి మున్సిపాలిటీ 1/70 ఏజెన్సీ చట్టం పరిధిలో ఉండటంతో అక్కడ దశాబ్దాలుగా ఎన్నికలు నిర్వహించడంలేదు.

షెడ్యూలు విడుదల...

మున్సిపాలిటీలలో ఓటరు జాబితా విడుదలకు ఈసీ కమిషనర్‌ రాణి కుముదిని షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కార్పొరేషన్‌ తో పాటు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు మంగళవారం ప్రారంభమైంది. అలాగే బుధవారం వా ర్డులు, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను విభజించనున్నారు. జనవరి 1 నుంచి వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం, పేర్లు, చిరునామాలపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. 5వ తేదీన మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహణ, 6వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) ఆధ్వర్యంలో జిల్లా స్థా యిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, ఓటరు జాబితా పట్ల అభ్యంతరాలపై చర్చిస్తారు. అనం తరం ఓటర్‌ జాబితాలో మార్పులు, చేర్పులు చేపట్టి తుది జాబితాను జనవరి 10న విడుదల చేస్తారు.

ఫిబ్రవరిలోనే మున్సిపల్‌ ఎన్నికలు...?

పంచాయతీ ఎన్నికల ఫలితాలపట్ల ఉత్సాహంతో ఉ న్న కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సి ద్దమవుతోంది. పంచాయతీ వేడి తగ్గకముందే ఎన్నికలు నిర్వహించడం ద్వారా మున్సిపాలిటీల్లో అత్యధిక మెజా ర్టీ సాఽధించే ఆలోచనతో ఉంది. ఈ క్రమంలో మంచి ర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని లక్షె ట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మున్సిపాలి టీల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సిద్దప డుతున్నట్లు తెలుస్తోంది. తొలుత మున్సిపాలిటీల ఎన్నిక లు నిర్వహించిన తరువాత కార్పొరేషన్‌ ఎలక్షన్లకు వె ళ్తారని ప్రచారం జరిగినప్పటికీ అన్నింటికీ ఒకేసారి ని ర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Dec 30 , 2025 | 11:38 PM