kumaram bheem asifabad-స్థానిక సమరానికి సమాయత్తం
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:04 PM
గ్రామ పంచాయతీలకు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పులో గ్రామాల్లో ఆశావహనులు సమరానికి సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని, ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారని ప్రజలు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసుత్తం హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వాహణలో కదలిక వచ్చింది.
- గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి షురూ
- ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న అధికారులు
- వ్యూహరచనలో రాజకీయ పార్టీల నాయకులు
గ్రామ పంచాయతీలకు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పులో గ్రామాల్లో ఆశావహనులు సమరానికి సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని, ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారని ప్రజలు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసుత్తం హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వాహణలో కదలిక వచ్చింది.
చింతలమానేపల్లి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బుధవారం హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వడంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడా..? అని ఎదురు చూసిన ఆశావహుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసింది. ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాయి. అరవై రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. దీంతో అధికార యంత్రాంగం, పలు ప్రధాన పార్టీల్లోనూ కదలిక మొదలైంది. సెప్టెంబరులో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్నది. ఆ లోగా అన్ని ఏర్పాట్లతో సర్వన్నద్దంగా ఉండేందుకు పార్టీలు సిద్దం అవుతున్నాయు.
15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 335 గ్రామ పంచాయతీ స్థానాలుండగా, వార్డు సభ్యుల స్థానాలు 2,874 ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. 137 ఎంపిటీసీ స్థానాలు, 15 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో సిర్పూర్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 320, పురుష ఓటర్లు 1,15,323 మహిళా ఓటర్లు 1,15,811 ఇతరులు 16 మంది ఉండగా మొత్తం 2,31,150 ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 358 పురుష ఓటర్లు 1,13,815 మహిళా ఓటర్లు 1,15,813 ఇతరులు 16 మంది ఉండగా మొత్తం 2,29,644 ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 678 పురుష ఓటర్లు 2,29,138 మహిళా ఓటర్లు 2,31,624 ట్రాన్స్ జెండర్స్ 32 మంది మొత్తం మంది ఓటర్లు 4,60,794 ఉన్నారు. ఇంకా అర్హులైన వారు ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వడంతో మరింత ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
- ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు..
పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు రేసి సిద్ధంగా ఉంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. వారికి శిక్షణ సైతం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో బదిలీలు జరిగినందువల్ల గతంలో విధులు అప్పగించిన ఉద్యోగుల్లో మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా..అని ఎన్నికల సంఘం ఆరా తీసింది. అధికారులు వివరాలను టీ-పోల్‌లో నమోదు చేశారు. ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక్క విడతలో ఎన్నికలు ఉండనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2వేల పైనే సిబ్బంది అవసరం ఉండవచ్చని అంచనా.
- వ్యూహరచనలో ప్రధాన పార్టీలు..
స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పట్టు నిలుపుకునేందుకు ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలు వ్యూహరచన చేసుకుంటున్నారు. జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తుండగా, బీఆర్‌ఎస్ నుంచి ఆసిఫాబాద్ నియోజక వర్గానికి కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ గ్రామాల్లో తమ ఎమ్మెల్యే ఎవరిని అభ్యర్థులను నిలబెడితే వారిదే గెలుపు అన్న ధీమాలో వారి వారి పార్టీలకు చెందిన ఆయా అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఏడాదిన్నర కాలంగా మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నరకం ధాన్యానికి బోనస్ రూ. 500 వంటి పథకాల అమలు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల ముందుకు పోయేందుకు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మద్య విభేదాల కారణంగా తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
తేదీలు ఖరారు కాకున్నా..
ఎన్నికల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఇప్పటికే గామ్రాల్లో ఎన్నికల సందడి మొదలైం ది. ఆశావహులు తమ బలాన్ని, బలగాన్ని కూబగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి అన్ని సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు.