Share News

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:01 PM

2005-06 సంవత్సరం వానాకాలం సీజన్‌కుగాను రైతులు పండిం చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాం గం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో వర్షాలు పడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అఽధి కారులు ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు సన్నా హాలు చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం

లక్షెట్టిపేట మండలం గుళ్లకోటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-2.32 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

-317 సెంటర్ల ప్రారంభానికి సన్నాహాలు

-కేంద్రాల వద్ద రైతులకు మౌళిక సదుపాయాలు

-మద్దతు ధరలపైనే రైతుల పెదవి విరుపు

మంచిర్యాల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): 2005-06 సంవత్సరం వానాకాలం సీజన్‌కుగాను రైతులు పండిం చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాం గం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో వర్షాలు పడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అఽధి కారులు ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు సన్నా హాలు చేస్తున్నారు.

2.32 లక్షల మెట్రిక్‌ టన్నులు అంచనా...

జిల్లాలో యాసంగి సీజన్‌తో పోలిస్తే వానాకాలం సీజన్‌లో వరి దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. భా రీ వర్షాలు, వరదల కారణంగా ఈ సారి పంట దిగు బడిపై ప్రభావం చూపింది. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో వానాకాలం సీజన్‌లో లక్షా 57వేల 642 ఎకరాల్లో వరి సాగు చేయగా 2 లక్షల 32 వేల 743 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అదే ఈ ఏడాది యాసంగి సీజన్‌లో జిల్లాలో ఏకంగా 3 లక్షల 40వేల 301 మెట్రిక్‌ టన్నులు దిగు బడి వస్తుందని అంచనా వేయగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్ష మెట్రిక్‌ టన్నుల మేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వానాకాలంలోనూ రూ. 500 బోనస్‌....

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అధనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ప్రకటించింది. గత ఏడాది నుంచి ప్రారంభమైన బోనస్‌ చెల్లింపులు యాసంగి, వానాకాలం సీజన్‌లలోనూ కొన సాగించారు. సన్నాలకు బోనస్‌ చెల్లింపులతో వరి సాగు ఊపందుకున్నప్పటికీ అతివృష్టి పంట దిగుబడి తగ్గడా నికి కారణమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

317 కేంద్రాల ఏర్పాటుకు...

వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సం బంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 317 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 150 కేంద్రాలు ఏర్పాటు చేయ నుండగా, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 97, డీసీఎంఎస్‌ ఆధ్వ ర్యంలో 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తం అ వుతున్నారు. ఆయా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ధా న్యం కొనుగోళ్లు చేయనున్నారు. ఈ మేరకు సెంటర్‌ ని ర్వాహకులకు అవసరమైన శిక్షణ పూర్తి చేశారు. అలా గే లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 58 లక్షల 18వేల పై చిలుకు గన్నీ సంచులు అవసరం కా గా 31 లక్షల 35 వేల వరకు అందుబాటులో ఉన్నా యి. అలాగే 6వేల 409 టార్పాలిన్లు, 90 ఆటోమెటిక్‌ ప్యాడీ క్లీనర్లు, 447 తేమ యంత్రాలు, 493 ఎలకా్ట్రనిక్‌ తూకం యంత్రాలు, తదితర పరికరాలతోపాటు మిగతా గన్నీ సంచులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉం చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి తరలిపునకు చెక్‌...

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల కు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాన్యం తరలింపు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. కేవ లం జిల్లా రైతులు పండించిన దాన్యాన్నే కొనుగోలు కేం ద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నరకం వడ్లకు రూ. 500 చొప్పున బోనస్‌ ఇస్తున్నందున అంతరాష్ట్ర చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీస్‌, రెవెన్యూ, వ్యవసా య అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తు న్నారు. ఆయా శాఖల సిబ్బంది సమన్వయంతో అంత రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయ నున్నారు. చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.

స్వల్పంగా పెరిగిన మద్దతు ధరలు....

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా వానాకాలం సీజన్‌లో ధాన్యం మద్దతు ధరలు స్పల్పంగా పెరిగాయి. కేంద్రం ప్రకటించిన మేరకు వరి పంటకు మద్దతు ధర క్వింటాకు గ్రేడ్‌-ఏ రకం రూ. 2389, కామన్‌ వెరైటీ ధర రూ. 2369 ఉంది. గత ఏడాదితో పోలిస్తే గ్రేడ్‌ ఏ, కా మన్‌ వెరైటీకి రూ. 69 చొప్పున ధరలు పెరిగాయి. గత సంవత్సరం గ్రేడ్‌-ఏ రకం రూ. 2320 ఉండగా, కామన్‌ వెరైటీ రూ. 2300గా ప్రకటించారు. అయితే వరిసాగు చేసేందుకు ఎకరాకు సుమారు రూ. 25వేల వరకు ఖ ర్చు వస్తుందని, సాగు ఖర్చులకు అనుగుణంగా మరి కొంత మద్దతు ధర పెంచాల్సిందనే అభిప్రాయాలు రై తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సన్నరకం ధాన్యాని కి రూ. 500 బోనస్‌తో కలిపి క్వింటాకు రూ. 2889 గి ట్టుబాటు కానుంది.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం...

చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్‌

వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇదివరకే సంబం ధిత అధికారులకు సూచనలు జారీ చేశాం. కొన్ని చోట్లా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాము. కేంద్రా ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించాము. రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని ఎండబెట్టుకొని, చెత్తచెదా రం లేకుండా చేసి, కేంద్రానికి తీసుకు రావలసి ఉంటుంది.

Updated Date - Nov 08 , 2025 | 11:01 PM