రేషన్..పరేషాన్
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:21 PM
రేషన్‌షాపు ద్వా రా లబ్ధిదారులకు ఈ సారి మూడు నెలలకు సంబం ధించి బియ్యం ఇచ్చే పరిస్థితి జిల్లాలో కానరావడం లేదు. వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉం చుకొని జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన బి య్యాన్ని జూన్‌లోనే ఏకమొత్తంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదేశించింది.
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీపై మల్లగుల్లాలు
ఒక నెలకి సరిపడా నిలువలు ఉన్నట్లు అంచనా
-స్టాక్ నిల్వ చేసేందుకు డీలర్ల అవస్థలు
ఈపాస్ సాఫ్ట్వేర్‌లోను అనేక సమస్యలు
కేంద్రం ఆదేశాలతో సర్కారు కసరత్తు
మంచిర్యాల, జూన్1(ఆంధ్రజ్యోతి): రేషన్‌షాపు ద్వా రా లబ్ధిదారులకు ఈ సారి మూడు నెలలకు సంబం ధించి బియ్యం ఇచ్చే పరిస్థితి జిల్లాలో కానరావడం లేదు. వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉం చుకొని జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన బి య్యాన్ని జూన్‌లోనే ఏకమొత్తంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదేశించింది. ఈనేపథ్యం లో రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించి సన్న బి య్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు పరిస్థితులు అ నుకూలించేలా లేవు. జిల్లాలో ఏ నెలకు ఆ నెల పంపి ణీ చేసేందుకు సరిపడా స్టాకు అందుబాటులోలేక డీల ర్లు ఆగమాగమవుతుండగా లబ్ధిదారులు ఆందోళన చెం దుతున్నారు. కొంతకాలంగా ప్రతి నెల బియ్యం పంపి ణీ చేయడంలో ఆలస్యం జరుగుతుండడమే దీనికి నిద ర్శనం. మండల లేవల్ స్టాకిస్టు(ఎంఎల్‌ఎస్) పా యిం ట్లలో సరిపడా నిల్వలు లేకపోవడంతో ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీలోపు పంపిణీ చేయాల్సిన బియ్యం నెలాఖరువరకు కూడ అందడం లేదు. ముఖ్యంగా స్టే జ్-1 కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎంఎల్‌ఎస్ పాయింట్ల కు సకాలంలో బియ్యం సరఫరా ఉండడం లేదు. దీం తో నిర్ణీత సమయానికి బియ్యం పంపిణీ చేయలేక డీల ర్లు అనేక అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో కేం ద్రం ఆదేశించిన మేరకు వర్షాకాలానికి సంబంధించి న మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం డీలర్లకు సవాలుగా మారింది.
ఒక నెల స్టాక్ పంపిణీ...
ఇదిలా ఉండగా జిల్లాలో ఉన్న మొత్తం 423 షాపు ల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మూడు నెల ల బియ్యం ఒకే సారి పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు చౌకధరల దుకాణాలకు నెలకు సరి ప డా స్టాకు మాత్రమే పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. స్టేజ్-1 కాంట్రాక్టర్ నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు స కాలంలో బియ్యం సరఫరా కాకపోవడంతో ఉన్న స్టాక్ ను తాత్కాలికంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వా స్తవానికి ప్రతీ నెల 31వ తేదీలోపు ఆ తరువాత నెలకు సంబంధించిన స్టాక్ చౌకధరల దుకాణాలకు చేరాల్సి ఉంది. అయితే నెల గడిచి 2వ తేదీ సమీపించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలోస్టాక్ చౌకధరల దుకాణా లకు చేరలేదు. దీంతో లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం ఎలా పోయాలో తెలియక డీలర్లు తలలు ప ట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల ఒక్కొ షా పునకు సగటున 80 క్వింటాళ్ల బియ్యం అవసరం ఉం టుంది. ఆ లెక్కన జిల్లాలోని షాపులకు బియ్యం సర ఫరా చేసేందుకు కనీసం మూడు లక్షల మెట్రిక్ ట న్నుల స్టాక్ అవసరం ఉంటుంది. కేంద్రం సూచించిన మేరకు మూడు నెలలు పంపిణీ చేయాలంటే దాదాపు 9లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని అంచనా.
అద్దెలు చెల్లించేది ఎలా...?
ప్రస్తుతానికి జిల్లాలో ఉన్న రేషన్‌షాపులు ఇరుకు అ ద్దె గదుల్లో నడుస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల బియ్యం స్టాకు ఉంచేందుకే డీలర్లు అవస్థలు పడుతున్నారు. ఒకే సారి మూడు నెలల బియ్యం స్టాక్ చేయాల్సి వస్తే పరి స్థితి ఏంటని డీలర్లు వాపోతున్నారు. మూడు నెలల బి య్యం స్టాక్ ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న గదులకు మూడంతలు పెద్ద గదులు కిరాయికి తీసుకోవాల్సి ఉం టుంది. ఇప్పుడున్న గదులకే కిరాయి చెల్లిం చేందుకు ఇబ్బందులు పడుతుండగా పెద్ద గదులను కిరాయి తీ సుకొనే వెసులుబాటులేదని డీలర్లు వాపోతున్నారు. ఒక వేళ కొత్త గదులు తీసుకుంటే అద్దెభారం ఎలా మో యాలనే ఆందోళనలో వారు ఉన్నారు.
ఈ-పాస్ సాఫ్ట్‌వేర్‌లోను సమస్యలు...
జిల్లా వ్యాప్తంగా ఉన్న షాపుల్లో ఈ-పాస్ సాఫ్ట్‌వేర్ లోను అనేక సమస్యలు నెలకొన్నట్లు డీలర్లు చెబుతు న్నారు. బయోమెట్రిక్ సమయంలో లబ్దిదారుల వేలి ముద్రలు, ఐరిష్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సకా లంలో ఈ-పాస్ యంత్రాలు తెరుచుకోక అనేక ఇబ్బం దులు పడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేసేందుకు ఈ-పాస్ పరికరాలు సపోర్ట్ చేసే పరిస్థితి లేదనేది వా రి వాదన. దీంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన బి య్యం పోయడంలోను డీలర్లు అవస్థలు పడుతున్నా రు. వాస్తవానికి ఒక రేషన్‌షాపు పరిధిలోని లబిఽ్ధదారు లకు సరిపడ స్టాక్ మాత్రమే డీలర్లకు అందుతోంది. ఈ క్రమంలో ఇతర గ్రామాలకు చెందిన లబ్ధిదారులు కూ డ చౌక దుకాణాల్లో బియ్యం తీసుకుంటుండడంతో అస లు లబ్ధిదారులకు కొరత ఏర్పడుతోంది. దీంతో డీలర్లు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మూడు నెలలకు స రిపడా స్టాక్ అందించాల్సి ఉండడంతో ఇతర ప్రాంతా లకు చెందిన వారికి సరిపడే స్టాక్‌ను సైతం తమకు అందించాలని డీలర్లు కోరుతున్నారు. జూన్ నెలకు సం బంధించిన రేషన్‌కోటా గత నెల 28వ తేదీలోపు షాపు లకు చేరాల్సి ఉన్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో స్టా క్ షాపులకు చేరలేదు. ఈ క్రమంలోమూడు నెలల స్టా క్ పంపిణీ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయంలో డీ లర్లు ఉన్నారు. కేంద్రం సూచించిన మేరకు లబ్ధిదారు లకు బియ్యం సరఫరాకావాలంటే పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి లబ్ధిదారుల సంఖ్యకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.