రేషన్ బియ్యం రాలే...
ABN , Publish Date - May 11 , 2025 | 11:14 PM
లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దుకాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నాయి. ప్రతి నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రేషన్ షాపుల్లో బియ్యం పోయాల్సి ఉం ది. అయితే 12వ తేది వచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయి లో స్టాక్ జిల్లాకు చేరనేలేదు. దీంతో కొన్ని రేషన్ షాపు ల్లో ఇప్పటి వరకు బియ్యం పోసిన దాఖలాలే లేవు. జి ల్లాలో మొత్తం ఐదు ఎంఎల్‌ఎస్(మండల్ లెవెల్ స్టాకి స్ట్ పాయింట్) గోదాముల ద్వారా 423 చౌక ధరల దు కాణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది.
-ఖాళీగా దర్శనమిస్తున్న ఎంఎల్‌ఎస్ పాయింట్లు
-పంపిణీ గడువు ముగుస్తున్నా షాపులకు చేరని వైనం
-చౌక ధరల దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ
-ప్రతి నెలా ఇదే తంతుతో ఇబ్బందికర పరిస్థితులు
-స్టేజి-1 కాంట్రాక్టర్ నుంచే జిల్లాకు చేరని స్టాకు
మంచిర్యాల, మే 11(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దుకాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నాయి. ప్రతి నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రేషన్ షాపుల్లో బియ్యం పోయాల్సి ఉం ది. అయితే 12వ తేది వచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయి లో స్టాక్ జిల్లాకు చేరనేలేదు. దీంతో కొన్ని రేషన్ షాపు ల్లో ఇప్పటి వరకు బియ్యం పోసిన దాఖలాలే లేవు. జి ల్లాలో మొత్తం ఐదు ఎంఎల్‌ఎస్(మండల్ లెవెల్ స్టాకి స్ట్ పాయింట్) గోదాముల ద్వారా 423 చౌక ధరల దు కాణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది.
ఖాళీగా దర్శనమిస్తున్న ఎంఎల్‌ఎస్ పాయింట్లు...
చౌక ధరల దుకాణాలకు రేషన్ బియ్యం సరఫరా చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్లు సరిపడా స్టాక్ లేక ఖాళీ గా దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని లబ్ధిదారుల అవసరా లకు సరిపడా బియ్యం మరుసటి నెలకు సంబంధించి నడుస్తున్న నెలలో 25వ తేదీలోపు అందుబాటులో ఉం చాలి. స్టాక్ వివరాల సరి చూసుకొని డీలర్లు ఒకటవ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు. మే నెలకు సంబంధించి మరో మూడు రోజులే గడువు ఉన్నా... ఇప్పటి దాక ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం స్టేజ్-1 కాంట్రాక్టర్ నుంచే జిల్లాకు చేరక పోవడం గమనార్హం. దీంతో ఎంఎల్‌ఎస్ పాయింట్లు మూసి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.
సగ భాగం కొరత...
జిల్లాలోని 423 షాపులకు లబ్ధిదారుల సంఖ్యను బ ట్టి సగటున ప్రతి నెల 80 క్వింటాళ్ల మేర బియ్యం అవసరం అవుతాయి. అయితే ఇప్పటి వరకు పలు ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో ఉన్న చౌక ధరల దు కాణాలకు బియ్యం చేరలేదు. మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ సీసీసీ నస్పూర్‌లో ఉండగా, దాని పరిధిలోని 20 షాపుల వరకు బియ్యం నెలకోటా పంపిణీ జరు గలేదు. ఆయా షాపుల పరిధిలో సుమారు రెండు వేల క్వింటాళ్ల వరకు పెండింగులో ఉంది. స్టాక్ కోసం డీలర్లు పాయింట్ల వద్ద పడిగాపులు కాసినా ఫలితం ఉండడం లేదు. దీంతో లబ్ధిదారులకు జవాబు చెప్పలేక డీలర్లు షాపులను మూసి ఉంచాల్సిన పరిస్థితులు నె లకొన్నాయి. స్టాక్ వచ్చినప్పుడల్లా తెరిచి అనంతరం మూసి ఉంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని స్వ యంగా డీలర్లే చెబుతుండడం గమనార్హం. మరో వైపు సకాలంలో డీడీలు తీయకనే కోటా విడుదల కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వారు వాపోతున్నారు.
తరుచుగా ఇదే తంతు...
కొంతకాలంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందడంలేదు. మార్చి నెలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా మరికొన్ని సా ర్లు అసలు స్టేషన్-1 కాంట్రాక్టర్ వద్దకే పౌర సరఫరా ల శాఖ నుంచి పంపిణీ జరుగడం లేదనే అభిప్రాయా లు ఉన్నాయి. ఇలా ప్రతి నెల ఏదో తంతు చూపి లబ్ధి దారులను షాపుల చుట్టూ తిప్పుకోవడం ఆనవాయితీ గా మారింది. ఈ సంవత్సరం స్టేజి-1 కాంట్రాక్ట్‌ను కరీం నగర్, వరంగల్‌కు అప్పగించారు. అక్కడి నుంచి జిల్లా కు స్టాకు చేరేందుకు కూడా అధిక సమయం పడుతు న్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బి య్యం ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితు లు నెలకొనగా, షాపుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి లబ్ధిదారులకు పట్టింది.
గడువు పెంచుతారా...?
రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ఈ నెల 15తో గడువు ముగియనుండగా అధికారులు స్పందించి గడు వు పెంచాల్సిన అవసరం ఉంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల లో బియ్యం నిల్వ లేక, డీలర్లకు స్టాకు చేరడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు ఇబ్బందులు పడ కుండా సరిపడా స్టాక్ వచ్చి పంపిణీ పూర్తయ్యే వరకు గడువు పెంచాలనే డిమాండ్లు సర్వత్రా వినిపి స్తున్నాయి.
బియ్యం ఇస్తలేరు...వాణి, ఎల్‌ఐసీ కాలనీ
గత రెండు మూడు నెలలుగా రేషన్ షాపుల్లో సరి గ్గా బియ్యం పొస్తలేదు. ప్రతినెల 1 నుంచి 15వ తేదీ లోపు పోయాల్సి ఉంది. 12వ తేదీ వచ్చిన బియ్యం ఇయ్యకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. బియ్యం ఎప్పుడు ఇస్తరో తెలియక ప్రతిరోజూ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
కొనుక్కున్నాక ఇస్తే ఏం లాభం....
శంకరమ్మ, సంజీవయ్య కాలనీ
బియ్యం పంపిణీ ప్రతినెలా ఆలస్యంగానే ఇస్తున్నరు. అడిగితే స్టాకు రాలేదంటున్నారు. ప్రతిసారీ ఇదే తం తు. సకాలంలో బియ్యం అందితే ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని సంతోషపడ్డా, అవి సమయానికి అందడం లేదు. మార్కెట్లో కొనుక్కున్నాక ఇస్తే ఏం లాభం.