రేషన్ నో స్టాక్....!
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:10 PM
ప్రభుత్వ పరంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం 18 రోజులు గడుస్తున్నా ఇంతవరకు లబ్దిదారు లకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు లబ్దిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
-గడువు ముగిసినా అందని బియ్యం
-స్టాక్ రావడం లేదంటున్న డీలర్లు
-పోర్టబిలిటీ సిస్టంతోనే ఇబ్బందులు
-చౌకధరల దుకాణాలకు సకాలంలో పంపిణీకాని వైనం
-అసలు కార్డుల దారులకు సరుకు ఇవ్వలేని పరిస్థితి
మంచిర్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పరంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం 18 రోజులు గడుస్తున్నా ఇంతవరకు లబ్దిదారు లకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు లబ్దిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందు కోసం జిల్లాలోని ఎంఎల్‌ఎస్ (మండల లెవల్ స్టాకిస్ట్) పాయింట్ల నుంచి ప్రతీ నెల 25వ తేదీలోపు బియ్యం రేషన్ షాపులకు చేరాల్సి ఉంటుంది. ఎంఎల్ ఎస్ పాయింట్లలో స్టాక్ లేని కారణంగా అక్టోబరు కో టా విడుదల కాలేదు. ప్రత్యామ్నాయంగా సివిల్ సప్లై అధికారులు పొరుగు జిల్లాల నుంచి తెప్పించే ప్రయ త్నం చేస్తున్నా....స్టాక్ పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఖాళీగా దర్శనమిస్తుం డగా, రేషన్ షాపుల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అరకొరగా పంపిణీ...
స్టేజ్-1 కాంట్రాక్టర్ నుంచే స్టాక్ విడుదల కాకపోవ డంతో ఇతర జిల్లాల నుంచి తెప్పించిన బియ్యాన్ని షా పుల వారీగా అరకొరగా పంపిణీ చేస్తున్నారు. దీంతో బి య్యం కొందరికే అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, కోటపల్లి, లక్షెట్టిపే టలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 423 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 2 లక్షల పై చిలుకు రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల సగటున ఒక్కో షాపులో 150 నుంచి 200 క్వింటాళ్ల బి య్యం పంపిణీ జరగాల్సి ఉంది. అక్టోబరు కోటాకు సం బంధించి చాలా మంది లబ్ధిదారులకు బియ్యం అం దకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
మిల్లుల నుంచే సరఫరా లేదా...?
రైస్ మిల్లుల నుంచే బియ్యం సరఫరా లేని కారణం గా పేదలకు రేషన్ సరుకు అందడం లేదని తెలుస్తోం ది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వరి ధాన్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీఎంఆర్ (కస్ట మ్ మిల్లింగ్ రైస్) కోసం మిల్లులకు తరలిస్తారు. మిల్లింగ్ తరువాత బియ్యం నేరుగా స్టేజ్-1 కాంట్రా క్టర్‌కు అందుతుంది. అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్ పా యింట్లకు చేరిన తరువాత స్టేజ్-2 కాంట్రాక్టర్ ద్వారా చౌక ధరల దుకాణాలకు చేరుతుంది. అయితే సీఎంఆ ర్ కోసం తీసుకున్న ధాన్యాన్ని కొందరు మిల్లర్లు సకా లంలో బియ్యంగా మార్చకపోవడంతోపాటు బయట మార్కెట్లో అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీం తో మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేక స్టేజ్-1 కాంట్రాక్టర్‌కు బియ్యం సరఫరా నిలిచిపోయినట్లు ప్రచారం జరుగు తోంది. ఈ కారణంగా జిల్లాలో రేషన్ బియ్యం స్టాక్ లే క ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. మిల్లర్లు స కాలంలో సీఎంఆర్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితులు తలె త్తేవి కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే తరుచుగా ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బి య్యం నిల్వలు ఉండటం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థి తిని అధిగమించడానికి అధికారులు ఇతర జిల్లాల నుంచి స్టాక్ తెప్పిస్తున్నప్పటికీ లబ్ధిదారులకు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
పోర్టబిలిటీ సిస్టంతో ఇబ్బందులు...
చౌకధరల దుకాణాలకు ఓ వైపు సక్రమంగా రేషన్ బియ్యం సరఫరా కాకపోగా, మరోవైపు పోర్టబిలిటీ సి స్టంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోర్ట బిలిటీ సిస్టం అమల్లోకి రావడంతో ఒక రేషన్ షాపున కు చెందిన లబ్ధిదారు, రాష్ట్రంలోని మరో షాపులో ఎక్క డైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో ని అన్ని రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ విధానం ద్వారా ప్ర తీ నెల సగటున 50 క్వింటాళ్ల వరకు డీలర్లు బియ్యం పోస్తున్నారు. అక్టోబరులోనూ వచ్చిన నెల స్టాక్ నుంచి వివిధ షాపుల్లో పోర్టబిలిటీ సిస్టం ద్వారా బయటి వా రికి బియ్యం పంపిణీ జరిగింది. సకాలంలో స్టాకు వ స్తుందనే నమ్మకంతో డీలర్లు పోర్టబిలిటీ వారిని కా దనలేకపోయారు. ఇప్పుడు షాపులకు బియ్యం పంపిణీ జరుగకపోవడంతో ఆయా షాపుల పరిధిలోని అసలు లబ్ధిదారులకు ఇవ్వడానికి స్టాక్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, పోర్టబిలిటీ సిస్టంలో రైస్ పంపిణీ చే సిన డీలర్లు ప్రతి నెల 7వ తేదీలోగా సరఫరా చేసిన సరుకు సరిపడా రిక్వెస్ట్ పెట్టాలి. అప్పుడే బయటకు వె ళ్లిన స్టాకు స్థానంలో కొత్త స్టాకు సరఫరా అవుతుంది. డీలర్లు రిక్వెస్ట్ పెట్టినప్పటికీ సకాలంలో కోటా విడుదల కాకపోతే అసలు లబ్దిదారులకు మొండి చేయి చూపా ల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొం ది. పోర్టబిలిటీ సిస్టం ద్వారా పొరుగు వారికి బియ్యం పంపిణీ చేయగా, స్టాకు రాకపోవడంతో అసలు కా ర్డుదారులకు సరుకు పంపిణీ చేయలేక పోయారు. దీం తో లబ్ధిదారుల నుంచి చీవాట్లు పడక తప్పడం లేదని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.