పల్లెల్లో రేషన్ కష్టాలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:57 PM
రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఉగాది నుంచి రేషన్ దుకాణాల్లో లబ్ధిదారుల కు సన్న బియ్యం అందిస్తోంది. అంతకు ముందు వర కు దొడ్డు బియ్యం అందివ్వడంతో ఎక్కువ శాతం లబ్ధిదారులు వాటిని తినలేక అమ్ముకున్న పరస్థితులు చూ శాం.
సన్న బియ్యం తెచ్చుకోవాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే..
-షాపులు ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి
భీమిని, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఉగాది నుంచి రేషన్ దుకాణాల్లో లబ్ధిదారుల కు సన్న బియ్యం అందిస్తోంది. అంతకు ముందు వర కు దొడ్డు బియ్యం అందివ్వడంతో ఎక్కువ శాతం లబ్ధిదారులు వాటిని తినలేక అమ్ముకున్న పరస్థితులు చూ శాం. అయితే సన్న బియ్యం పంపిణీ ప్రారంభం అ యినా ఇక్కడ కొన్ని గ్రామాల లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎందుకంటే రేషన్‌దుకాణాలు గ్రామా ల్లో లేక మైళ్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నా యి. ఇతర పనులను పక్కన పెట్టి గ్రామస్థులు కొంత మంది కలిసి రేషన్ బియ్యం కోసం ప్రత్యేకంగా ఏదో ఒక కార్యక్రమానికి వెళ్లినట్లు వెళ్లాల్సిన పరిస్థితి. పేద లకు రేషన్ బియ్యం అందించే చౌకదుకాణాలు అందు బాటులో లేక పోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల పరిధిలోని ఆమ్లెట్ విలేజిల్లో రేషన్ దుకాణాలు అందుబాటులో లేకపోవడంతో కిలో మీటర్ల దూరం నడిచి లేదా ఆటోల ద్వారా రేషన్ సర కులను తెచ్చుకోవాల్సి వస్తోంది. నెల నెల రేషన్ బి య్యం తెచ్చుకోవడం ఒక ప్రహసనంగా మారింది. దీని కోసం సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకె ళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమ నార్హం. భీమిని మండలంలో 4,107 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అక్కలపల్లి, బిట్టూ రుపల్లి, రాజారం, పెద్దగుడిపేట, చిన్నతిమ్మాపూర్, తం గళ్లపల్లి, పెద్దపేట గ్రామాల్లో రేషన్ షాపులు లేకపోవ డంతో 4 నుంచి 5 కిలోమీటర్లు నడిచి లేదా ఆటోల ద్వారా రేషన్ సరకుల కోసం రావడం ఎంతో ప్రయా సగా మారింది.
దూరభారంతో తప్పని తిప్పలు....
పెద్దతిమ్మాపూర్, చిన్నతిమ్మాపూర్, తంగళ్లపల్లి గ్రా మంలో రేషన్ షాపు లేకపోవడంతో 15 కిలోమీటర్ల ప రిధిలోని దహగాం మండలంలోని సాలిగాం గ్రామాని కి వెళ్లి రేషన్ సరకులు తీసుకోవాల్సి వస్తుంది. పెద్దగు డిపేట గ్రామస్థులు రేషన్ సరకుల కోసం మల్లీడి గ్రా మానికి 6 కిలోమీటర్లు, రాజారం గ్రామస్థులు 3 కిలో మీటర్ల దూరం వెళ్లి మల్లీడి గ్రామానికి వెళ్లి, అక్కలపల్లి గ్రామస్థులు ఖర్జిభీంపూర్ గ్రామంలోని 2 కిలోమీటర్లు, పెద్దపేట గ్రామస్థులు 2 కిలోమీటర్ల పరిధిలోని వడాల చౌకదుకాణానికి వెళ్లాల్సి వస్తోంది. ఆయా గ్రామాల ప్ర జలు రేషన్ బియ్యం కోసం ఇంత దూరం వెళ్లక తప్పని పరిస్థితి దాపురించింది.
- రేషన్ గోడు వినేదెవరు....
రేషన్ కోసం మండలంలో పలు గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థల గురించి రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు గ్రామస్థులు, తాజా మాజీ సర్పం చులు పలుసార్లు ఏకరువు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎక్కడి వేసిన గొంగడి అక్కడిలా...
పరిస్థితి తయారైంది. ప్రజల గోడును అధికారులు పట్టించుకోక పోవడం పట్ల విస్మయం వ్యక్తం అవుతుంది, ఇప్పటికైనా రేషన్ దు కాణాలు లేని గ్రామాల్లో దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పనులు వదులుకుని దుకాణాలకు వస్తున్నాం..
దుర్కి అనిత, రాజారం
రేషన్ బియ్యం కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి రావడంతో రోజువారి కూలీ పనులను వదులుకోని దుకాణం వద్దకు పరుగులు తీయాల్సి వస్తుంది. ప్రతీ నెల ఈ విధంగా పనులను మానుకోని బియ్యం కోసం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది.
ఆటోల ద్వారా రేషన్ సరకులు..
ఇందూరి కమల, తంగళ్లపల్లి
మా గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలిగాం గ్రామంలోని రేషన్ షాపు కోసం లగే జీతో రూపాయలు 150 చెల్లించాల్సి వస్తుంది. అ యినా రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. రేషన్ షాపు ఏర్పాటు చేసి న్యాయం చేయాలి.
ఉన్నతాధికారులకు నివేదించాము..
బికర్ణ దాస్ తహసీల్దార్, భీమిని
మండలంలో రేషన్ దుకానాలు లేని గ్రామాల వివరా లను ప్రజల ఇబ్బందులను జిల్లా ఉన్నతాధికా రులకు గతంలో నివేదించాము. వారి ఆదేశాల మేరకు త దుపరి కార్యచరణ ఉంటుంది. ఉన్నతాధికారుల నుం చి అనుమతులు రాగానే ఏర్పాటు చేస్తాం.