Share News

కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:02 AM

జిల్లాలోని రేషన్‌ డీలర్లకు ఆరు నెలల కమిషన్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమ వారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట మంచిర్యాల జిల్లా చౌకధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్య క్తం చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల నిరసన

నస్పూర్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని రేషన్‌ డీలర్లకు ఆరు నెలల కమిషన్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమ వారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట మంచిర్యాల జిల్లా చౌకధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్య క్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు అందజేశారు. అనంతరం నాయ కులు మాట్లాడు తూ పంపిణీ చేసిన ఉచిత బియ్యానికి సంబంధించిన కమీషన్‌ ఆరు నెలలు గడుస్తున్నా ఇవ్వలేదన్నారు. కమీషన్‌ రాకపోవ డంతో కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

ప్రభుత్వం హామీ ఇచ్చిన గౌరవ వేతనం రూ. 5వేలు, రూ. 300 కమీషన్‌ ఇప్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ సుదమల్ల కృష్ణ, నాయకులు మహేందర్‌, రవి పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:02 AM