kumaram bheem asifabad- అర్హులందరికీ రేషన్ కార్డులు
ABN , Publish Date - Jul 31 , 2025 | 10:47 PM
ప్రభుత్వం అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు అందిస్తుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండలంలోని మహగాం రైతు వేదికలో సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాఽథ్‌రావుతో కలసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర కొనసాగే ప్రక్రియ అన్నారు.
సిర్పూర్(యు), జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు అందిస్తుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మండలంలోని మహగాం రైతు వేదికలో సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాఽథ్‌రావుతో కలసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర కొనసాగే ప్రక్రియ అన్నారు. కొత్త రేషన్‌కార్డులు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. జిల్లాలో మొత్తం ఎనిమిది వేల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవోలోకేశ్వర్ రావు, తహసీల్దార్ ప్రహ్లాద్, సహకార సంఘం చైర్మన్ కేంద్రే శివాజీ, మాజీ సర్పంచులు ఆత్రం పద్మాబాయిరాజేశ్వర్‌రావు, ఆర్క నాగోరావు తదితరులు పాల్గొన్నారు.
జైనూర్,(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పరంగా రేష న్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో గురువారం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల నుంచి పేర్లను తొలగించడం, కొత్తవి చేర్చడం వంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుం దని చెప్పారు. ప్రజలు సంబంధిత మీ సేవ కేంద్రాలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న వారు సైతం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని మారుమూల గ్రామాల అభివృధ్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా రైతులకు రైతు భరోసా అందించి మన్ననలు పొందుతుందన్నారు. జైనూర్ మండలంలో నూతనంగా 913 రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటిని ప్రజల సమక్షంలో పంపిణీ చేశామని వివరించారు. 1,595 మంది పేర్లు రేషన్‌కార్డుల్లో చేర్చామని తెలిపారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ డెవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్, తహసీల్దార్ ఆడ బీర్షావ్, అర్‌ఐ మోహన్, నాయకులు మేస్రాం అంబాజీ తదితరులు పాల్గొన్నారు.