అర్హులందరికీ రేషనకార్డులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:01 AM
అర్హులందరకీ రేషన కార్డులు అందజేయడమే ప్రభుత్వం లక్ష్యమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన అన్నారు.
అర్హులందరికీ రేషనకార్డులు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన
తిరుమలగిరి, జూలై 13(ఆంధ్రజ్యోతి): అర్హులందరకీ రేషన కార్డులు అందజేయడమే ప్రభుత్వం లక్ష్యమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి, ప్రారంభించబోయే రేషన కార్డుల పంపిణీ సభాస్థలం వద్ద ఆదివారం కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్పీ సరసింహతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన కార్డులు ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేశామని తెలిపారు.
తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చేతుల మీదగా రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఒకే సారి పెద్ద మొత్తంలో 5లక్షల61వేల రేషనకార్డులు ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. అంతేకాక 27.83 లక్షల యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి గాను ఏడాదికి ప్రభుత్వం మీద రూ. 1150 కోట్ల భారం పడుతుందన్నారు. గతంలో 2.81 కోట్ల మంది జనాభాకు రేషనకార్డులు ఉన్నాయని, ఇప్పుడు 3.10 కోట్ల మంది జనాభాకు రేషనకార్డులు పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు రేషన కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం అందించడానికి రేషనకార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులందరికీ రేషనకార్డు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషనకార్డుల కోసం ప్రజావాణి, ప్రజాపాలన, మీసేవల ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లాలో 23,870 రేషన కార్డులు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట జిల్లాలో నూతనంగా 23,870 రేషనకార్డులు పెరిగినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ మేరకు 72,802 యూనిట్లు పెరిగాయన్నారు. ఇంతకుముందు 3.24,160 కార్డులు ఉండేవని, 9.31లక్షల యూనిట్లు ఉండేవని పేర్కొన్నారు. కొత్తగా పెరిగిన వాటితో 3.50 లక్షల కార్డులకు చేరుకుంటాయని, 10.57 లక్షల యూనిట్లు పెరుగుతాయని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 61,641 రేషనకార్డులకు 1.87 లక్షల యూనిట్లు ఉండగా కొత్తగా 4230 రేషనకార్డులకు మరో 13వేల యూనిట్లు పెరిగినట్లు ఆయన వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీపీఆర్‌వో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.