Share News

kumaram bheem asifabad- సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికం

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:23 PM

అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్‌ కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పెంచికలపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రేషన్‌ కార్డుల మంజూరు పత్రాలను బుధవారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

kumaram bheem asifabad- సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికం
పెంచికలపేటలో పత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ విఠల్‌, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

పెంచికలపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్‌ కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పెంచికలపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రేషన్‌ కార్డుల మంజూరు పత్రాలను బుధవారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారలకు చేరడంలో రేషన్‌ కార్డుఏల ప్రామాణికంగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం చేటప్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులైన వారికి రేషన్‌ కార్డుల కొరకు దరఖాస్తులు సేకరించి క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన పేద వారికి ప్రభుత్వం రేషన్‌ కార్డులు మంజూరు చేసిందని తెలిపారు. సుదర్ఘీకాలం తరువాత ప్రభుత్వం రేషన్‌ కార్డులు అందిస్తుందన్నారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడుతూ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, వివాహం అయినవారు, పిల్లల పేర్లను రేషన్‌ కార్డులలో నమోదు కొరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసీల్దార్‌, సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి) : అర్హులైన పేద ప్రజలందరికి రేషన్‌ కార్డులు అందజేస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి రేషన్‌ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత తహసీల్దార్‌లు రేషన్‌ కార్డలను మంజూరు చేయిస్తారని తెలిపారు. రేషన్‌ కార్డుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు ప్రమాణికం కావడంతో ప్రతి ఒక్కరికి కార్డు అవసరమైందని అన్నారు. రేషన్‌ కార్డు ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా సేవలు కూడా అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, వ్యవసాయాధికారి నాగరాజు, నాయకులు గణపతి, శ్రీవర్ధన్‌, విశ్వేశ్వర్‌, నాహీర్‌ అలీ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:23 PM