Share News

Rare butterfly species: ములుగు అడవుల్లో అరుదైన సీతాకోకచిలుకలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 02:59 AM

ములుగు జిల్లా అభయారణ్యంలో 80 రకాల అరుదైన సీతాకోక చిలుకల జాతులను ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ గుర్తించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్నవరం...

Rare butterfly species: ములుగు అడవుల్లో అరుదైన సీతాకోకచిలుకలు

  • కొత్తగా 80 రకాల జాతుల గుర్తింపు

ములుగు రూరల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా అభయారణ్యంలో 80 రకాల అరుదైన సీతాకోక చిలుకల జాతులను ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ గుర్తించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్నవరం, తాడ్వాయి, పస్రా అడవుల్లో మూడు రోజులపాటు ఈ పరిశోధన చేసినట్లు సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగ్వేర్‌రావు తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 150కి పైగా సీతాకోకచిలుకల జాతులు ఉండగా, కొత్తగా 80 జాతులను గుర్తించినట్టు పేర్కొన్నారు. సీతాకోకచిలుకలు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయని అటవీ శాఖ జిల్లా అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ తెలిపారు. అరుదైన జాతులను గుర్తించి వాటి మనుగడను కాపాడడానికి పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

Updated Date - Nov 10 , 2025 | 02:59 AM