Share News

Accident: టిప్పర్‌ ఢీ.. ర్యాపిడో డ్రైవర్‌, ప్యాసింజర్‌ మృతి

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:23 AM

ర్యాపిడో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టడంతో బైక్‌ డ్రైవర్‌, వెనకాల కూర్చున్న ప్యాసింజర్‌ ఇద్దరూ చనిపోయారు. హైదరాబాద్‌లో....

Accident: టిప్పర్‌ ఢీ.. ర్యాపిడో డ్రైవర్‌, ప్యాసింజర్‌ మృతి

గాజులరామారం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ర్యాపిడో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టడంతో బైక్‌ డ్రైవర్‌, వెనకాల కూర్చున్న ప్యాసింజర్‌ ఇద్దరూ చనిపోయారు. హైదరాబాద్‌లోని సూరా రం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సూరారం వెంకట్రామ్‌ కాలనీకి చెందిన జ్యోతి(32), ఆమె భర్త శ్రీకాంత్‌ ఇద్దరు సమీపంలోని క్రాంతినగర్‌లో కూరగాయలు, కిరాణ దుకాణం నడుపుతున్నారు. సోమవారం జ్యోతి ర్యాపిడో బైక్‌పై దుకాణానికి వెళ్తుండగా.. ఆ బైక్‌ను వెనక నుంచి టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి, ర్యాపిడో డ్రైవర్‌ సురేందర్‌రెడ్డి ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Dec 09 , 2025 | 03:23 AM