రంగ్ బర్‌సే...
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:44 PM
మం చిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం హోలీ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. కాలనీలు, వీధుల్లో సందడి నెలకొం ది. చిన్నారులు, యువతీ, యువకులు రంగులు చల్లుకుం టూ సందడి చేశారు. డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు.

అంబరాన్నంటిన హోలీ సంబరాలు
ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు, మహిళలు
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : మం చిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం హోలీ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. కాలనీలు, వీధుల్లో సందడి నెలకొం ది. చిన్నారులు, యువతీ, యువకులు రంగులు చల్లుకుం టూ సందడి చేశారు. డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. వీ ధులన్నీ రంగుల హరి విల్లులను తలపించాయి. ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఫజిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీల హోలీ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రం గులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఫసంజీవయ్య నగర్‌లో గల ఆశ్రమ పాఠశాలలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్టల్ సంక్షేమాధికారి నైతం లక్ష్మణ్ విద్యార్థులతో కలిసి నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకున్నారు.
ఫమంచిర్యాలలోని డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ క్ల బ్ సభ్యులు హోళీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్లేష్‌గౌడ్, సంపత్‌కుమార్, మహేష్, అనంతరెడ్డి, మహేష్, శ్రీనివాస్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
గర్మిళ్ల: మంచిర్యాల పట్టణంలో హోలీ పండగ వేడుక లు శుక్రవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని బాయ్స్ స్కూల్ గ్రౌండ్‌లో ఫిట్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. కా ర్యక్రమంలో సెంటర్ అధ్యక్షుడు దార కుమారస్వామి, తుల ఆంజనేయులు, చంద్రకాంత్, అశోక్, దేవరాజు, శ్రీనివాస్ రెడ్డి, హనుమాండ్లు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని ఆది త్య ఎన్‌క్లేవ్ కాలనీలో కాలనీ వాసులు వేడుకలను ఘనం గా నిర్వహించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో హోలీ పండగ సంబరాలను ఘ నంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడి పారు. కార్యక్రమలో నాయకులు లక్ష్మణ్, సంతోష్, ఉత్తేజ్, రమేష్ పాల్గొన్నారు.
సంస్కృతి, ఐక్యతకు ప్రతీక హోళి
భారతీయ సంస్కృతి, ప్రజల ఐక్యతకు ప్రతీక హోలీ పండగ అని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవా రం కలెక్టరేట్ కార్యాలయంలో పలువురు అధికారులు కలెక్ట ర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుకుని ఒకరికి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మను షుల మధ్య ప్రేమానురాగాలను పండగలు తెలియజే స్తా యని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకో వాలని పేర్కొన్నారు. హోలీ రంగుల పండగ మాత్రమే కా దని, ప్రజల ఐక్యతకు పండగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, దుర్గా ప్ర సాద్, రవీందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, పురుషోత్తం, రాజేంద్ర ప్రసాద్ పంచాయతీ అధికారుల సంఘం నాయకులు శ్రీపతి బాపు పాల్గొన్నారు.
హోలీ పండుగ జీవితాలను రంగుల మయం చేయాలి
రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా
మంచిర్యాల క్రైం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగుల మయం కావాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. శుక్రవారం రామగుండంపోలీసు కమిషనరేట్ కా ర్యాలయంలో ఘనంగా హోలీ సంబురాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా రామగుండం సీపీ అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు మిఠాయిలు అందజేశారు. ఈ వేడుకల్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీ రమేశ్, నర్సింహులు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లా రెడ్డి, సీఐలు హరీశ్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.