president N Ranchand Rao: మెట్రో రైలు విస్తరణకు సహకరించండి
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:11 AM
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎంఎల్.ఖట్టర్‌ను కోరారు....
కేంద్ర మంత్రిని కోరిన రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎంఎల్.ఖట్టర్‌ను కోరారు. సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, పార్టీ నేతలతో కలిసి రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో డంపింగ్ యార్డుల ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళిక వంటి అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం కొనసాగించాలని రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంఎల్.ఖట్టర్ హామీ ఇచ్చారు.