President Ranchand Rao: స్వదేశీ నినాదంతో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:10 AM
ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన స్వదేశీ నినాదం దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రారచందర్‌రావు అన్నారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన స్వదేశీ నినాదం దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రారచందర్‌రావు అన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆయా రంగాల వారు ఆర్థికంగా మరింత నిలదొక్కుకుంటారని తెలిపారు. ఆదివారం, ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాంచందర్‌రావుతో పాటు పలువురు నాయకులు వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధిలో ప్రధాని మోదీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. స్వదేశీ నినాదం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మంగళవారం హైటెక్స్‌లోని ఎగ్జిబిషన్ హాలులో ‘మేరా దేశ్ పహలే-ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ’ మ్యూజికల్ కాన్సె్‌ప్టను మనోజ్ ముంతసిర్ అనే ఆర్టిస్టు ప్రదర్శిస్తున్నారని తెలిపారు.