Urea Production: చివరి దశకు ఆర్‌ఎ్‌ఫసీఎల్ మరమ్మతులు
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:39 AM
రామగుండం ఎరువుల కర్మాగారం మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీతో...
11న యూరియా ఉత్పత్తి ప్రారంభం!
కోల్‌సిటీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రామగుండం ఎరువుల కర్మాగారం మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీతో ఆగస్టు 14న ప్లాంట్ షట్‌డౌన్ అయింది. హెచ్‌టీఆర్ యంత్రం పాడైన కారణంగా బైపాస్ చేసి ఉత్పత్తి చేయడంతో ఒత్తిడి పెరిగి పైప్‌లైన్ లీకైనట్టు తెలుస్తోంది. నిపుణులు అందుబాటులో లేకపోవడంతో మరమ్మతు పనుల్లో జాప్యం ఏర్పడింది. డెన్మార్క్‌కు చెందిన హల్దర్ టాప్స్ ఇంజనీర్ వచ్చిన తరువాత ఎల్‌అండ్‌టీ సిబ్బందిని మరమ్మతు పనులకు కేటాయించారు. యంత్ర సామగ్రిని హైదరాబాద్‌కు పంపించి మరమ్మతు చేయించి ప్లాంట్‌లో బిగిస్తున్నారు. 11న ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే 14 నుంచి మార్కెట్‌లోకి ఆర్‌ఎ్‌ఫసీఎల్ యూరియా అందుబాటులోకి రానుంది.