Ram Puniyaani Criticizes: ఒక మతంపై ద్వేషం రగిలించడం అన్యాయం
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:16 AM
చరిత్రలో రాజులు, మతం, రాజ్యకాంక్ష కలగలసి ఉన్నాయి. వాటిని మన రా జకీయ ప్రయోజనాల కోసం వేర్వేరుగా చిత్రీకరించి ఒక మతంపై ద్వేషాన్ని....
విద్యావేత్త, చరిత్రకారుడు రామ్ పునియాని
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ‘చరిత్రలో రాజులు, మతం, రాజ్యకాంక్ష కలగలసి ఉన్నాయి. వాటిని మన రా జకీయ ప్రయోజనాల కోసం వేర్వేరుగా చిత్రీకరించి ఒక మతంపై ద్వేషాన్ని రగిలించడం అన్యాయం’ అని ప్రఖ్యాత విద్యావేత్త, చరిత్ర కారుడు రామ్ పునియాని అన్నారు. మహారాణా ప్రతాప్, అక్బర్ మధ్య సాగిన పోరులో అక్బర్ విజయం సాధించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతుంటే, రాణా ప్రతాప్ గెలిచినట్లుగా రాజస్థాన్ ప్రభుత్వం చరిత్ర మార్చి రాయించిందని పేర్కొన్నారు. ఔరంగజేబు పది దేవాల యాలను ధ్వంసం చేస్తే, కామాఖ్య, మహాకాళేశ్వర్ వంటి యాభైకుపైగా దేవాలయాలకు విరాళాలు ఇచ్చాడని రిచర్డ్ ఈటెన్ రీసెర్చ్ ట్రస్ట్ పరిశోధనలోనూ వెల్లడైందని వివ రించారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో ఆదివారం నాంపల్లిలోని మదీనా విద్యాలయం ప్రాంగణంలో ‘పాఠ్యాంశాల్లో చరిత్ర వక్రీకరణ -పరిణామాలు’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ పునియాని మాట్లాడుతూ మన దేశంలో ఇస్లాం వ్యాప్తికి అంటరానితనం లాంటి దురాచా రాలు ప్రధాన కారణమని విశ్లేషించారు. ‘భారతదేశంలోకి ఇస్లాం రావడమన్నది అణగారిన కులాల విముక్తి ఉద్య మం లాంటిద’ని స్వామి వివేకానంద అన్నారని ఉటం కించారు. తెలంగాణ విద్యా కమిషన్ అధ్యక్షుడు ఆకునూరి మురళి మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని పూర్తిగా తిరస్కరించనవసరం లేదని, అలా అని స్వాగతించలేమని అన్నారు. ఆచార్య పద్మజా షా, ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ బాధ్యురాలు డా. కాంచన్, రాష్ట్ర అధ్యక్షుడు లతీఫ్, ఉపాధ్యక్షురాలు మరియ తబస్సుమ్ తదితరులు మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో అబద్ధాల చరిత్ర జోడించడం ద్వారా విద్యార్థుల మనసుల్లో ద్వేష బీజాలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.