kumaram bheem asifabad- పాఠశాలల్లో రక్షాబంధన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:26 PM
ఆసిఫాబాద్‌తో పాటు లింగాపూర్ మండలంలోని పాఠశాలల్లో శుక్రవారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌తో పాటు లింగాపూర్ మండలంలోని పాఠశాలల్లో శుక్రవారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పాఠశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌లకు, బెటాలియన్ పోలీసులకు, బస్టాండులో డిపో మేనేజర్లకు, కండక్టర్లకు, ప్రయాణికులకు, కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్‌కు, మార్కెట్ ఏరియాలో విద్యార్థినులు రాఖీలు కట్టి నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష మనం ఈ దేవాశానికి ధర్మానికి రక్షా అని రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్‌రావు ఉన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యంలో శుక్రవారం విద్యార్థులు రక్షబంధన్ నిర్వహించారు. విద్యార్థులకు సంస్కృతి, సంప్ర దాయాలపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనారు.