kumaram bheem asifabad-మార్కెట్‌లో రాఖీ పండగ సందడి
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:13 PM
అన్నాచెల్లులు, అక్క తమ్ముడు ప్రేమానురా గాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి జిల్లాలో మొదలైంది. శనివారం రాఖీ పండగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కొనుగోలు దారులతో కిక్కిరిసి పోయింది.
ఆసిఫాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): అన్నాచెల్లులు, అక్క తమ్ముడు ప్రేమానురా గాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి జిల్లాలో మొదలైంది. శనివారం రాఖీ పండగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కొనుగోలు దారులతో కిక్కిరిసి పోయింది. పట్టణం లోని వివేకానంద చౌక్, గాంధీచౌక్, అబేద్కర్ చౌక్ రద్దీగా ఉండే వివిధ ప్రాంతాలలో రాఖీల దుకాణాలు వెలిశాయి. వివిధ డిజైన్లతో రూ.10 నుంచి రూ.500 వరకు ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. విభిన్న అకృతులతో డిజైన్ చేసి రాఖీలను విక్రయిస్తుండడంతో కొనుగోలు దారులు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ పట్టణంతో పాటు చుట్టు పక్కల మండలాలైన వాంకిడి, కెరమెరి, తిర్యాణి, రెబ్బెన నుంచి ప్రజలు వచ్చి కొనుగోలు చేశారు. రాఖీ పండగ సందర్భంగా ప్రయాణికులతో బస్టాండు ప్రాంగణం కిక్కిరి పో యింది. ప్రభ్వు జూనియర్ కళాశాలలో బీసీ యువజన సఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్‌కుమార్, షీ టీం ఇన్‌చార్జి స్వప్న, అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌లు పాల్గొని విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): రాఖీ పండగ సందర్భంగా గ్రామాల్లో సందడి నెలకొంది. రాఖీలు కొనుగలు చేందసుకు మహిళలు, యువకుతు పెద్ద ఎత్తున దుకాణాలకు తరలి వచ్చారు. తమ అన్న తమ్ముళ్ల కోసం రాఖీలు కట్టేందుకు అక్క చెల్లులు వివిధ ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లడంతో రద్దీగా మారాయి. ఒక రోజు ముందు నుంచే గ్రామీణ ప్రాంతాల నుంచి సోదరులకు రాఖీ కట్టేందుకు బస్సుల్లో బయలుదేరారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): రాఖీ పండగ సందర్భంగా మండల కేంద్రంలో దుకాణా న్ని రంగు రంగులు, విభిన్న రాఖీలతో ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం వార సంతలో మహిళలు పెద్దఎత్తున దుకాణాలకు చేరుకుని రాఖీలు కొనుగోలు చేశారు. రాఖీ దుకాణా లతో పాటు మిఠాయిల దుకాణాలు కూడా కిటకిటలాడాయి.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): రాఖీ పండగను పురష్కరించుకుని మండల కేంద్రంలోని రాఖీ దుకాణాలు వెలిశాయి. దీంతో రాఖీలు కొనుగోలు చేయడానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో దుకాణల వద్దకు చేరుకున్నారు. దీంతో మార్కెట్‌లో సందడి నెలకొంది.