kumaram bheem asifabad- జిల్లాలో ఘనంగా రాఖీ వేడుకలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:06 PM
అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి కుటుంబంలో అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్/వాంకిడి/బెజ్జూరు/చింతలమానేపల్లి/సిర్పూర్(టి)పెంచికలపేట/కెరమెరి/కౌటాల/దహెగాం/తిర్యాణి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి కుటుంబంలో అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులకు ఎమ్మెల్యే రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సరస్వతీ, అలీబీన్ అహ్మద్, అన్సర్, సాజీద్, ఖాసీం, జునేద్, బలరాం, నిస్సార్, రవి, అశోక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా పండగ పూట ప్రయాణికులతో జిల్లా కేంద్రం కిక్కిరిసిపోయింది. అద్దె బస్సు డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ రెండు గంటల పాటు నిరసన తెలపడంతో మరింత రద్దీ పెరిగింది. డిపో మేనేజర్ రాజశేఖర్ కల్పించకుని పండగపట నిరసన సరన విధానం కాదని సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో విధుల్లోకి వెళ్లారు. హైదరాబాద్‌కు ఒక సూపర్‌లగ్జరీతో పాటు మూడు ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఆశోక్ కాలనీకి చెందిన వ్యాపారి, ముస్లిం అయిన రాజీక్‌కు హిందూ సోదరీ రాఖీలు కట్టి మతసామరస్యాన్ని చాటారు.