Share News

ఆర్టీసీకి రాఖీ ధమాకా

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:58 AM

టీఎ్‌సఆర్టీసీ నల్లగొండ రీజియనకు రాఖీ పౌర్ణమి గిరా కీ కలిసొచ్చింది. రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల్లో రీజియనలో ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల నుంచి ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణించడంతో రూ.6,56,25,000 వేల ఆదాయం సమకూరింది.

 ఆర్టీసీకి రాఖీ ధమాకా

ఆర్టీసీకి రాఖీ ధమాకా

నల్లగొండ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సఆర్టీసీ నల్లగొండ రీజియనకు రాఖీ పౌర్ణమి గిరా కీ కలిసొచ్చింది. రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల్లో రీజియనలో ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల నుంచి ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణించడంతో రూ.6,56,25,000 వేల ఆదాయం సమకూరింది. ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఓ రికార్డు. సాధారణంగా రోజువారీ ఆక్యుపెన్సీ (ఓఆర్‌) 74 వస్తుంది కానీ రాఖీ పండుగ రోజు 122 శాతానికి పైగా ఓఆర్‌ నమోదైంది. ఫలితంగా ఆదాయం పెద్ద మొత్తంలో సమకూరింది. ప్రతీరోజు ఆర్టీసీకి రూ.1కోటి నుంచి రూ.1.60 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా రాఖీ పండుగ రోజు మాత్రం పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఇటీవల ఆర్టీసీ ప్రయాణికులను ఆకట్టుకోవడం కోసం వివిధ రకాల ఆఫర్లు ఇస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. రెగ్యులర్‌కు వచ్చే ఆదాయానికి తోడు అదనంగా వచ్చిన ఆదాయంతో ఆర్టీసీ లాభాల బాట చేరింది. సోమవారం తిరుగు ప్రయాణంతో మరో 2లక్షల మంది వివిధ ప్రాంతాలకు చేరుకోవడం వల్ల రూ.2కోట్ల రెవెన్యూ రానుంది. మొత్తంగా ఈ నాలుగు రోజులు కలిపి రూ.8.56 కోట్లకు పైగా రెవెన్యూ చేరుకోనుంది.

రీజియనలోని 7 డిపోల పరిధిలో

నల్లగొండ రీజియనలో 7 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో శుక్ర, శని, ఆదివారాల్లో సుమారు 750 బస్సులు 8లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. దీంతో రూ.6.56 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అధిక సంఖ్యలో బస్సులు నడిపించడంతో ఆదాయం పెరిగింది. రీజియనలో ఉన్న బస్సులన్నింటినీ రోడ్డెక్కించారు. సిబ్బందిని ప్రోత్సహించడంతో మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు సమష్టిగా కృషి చేశారు. ఫలితంగా ఒక్క బస్సు కూడా బ్రేక్‌డౌన కాకుండా తిరిగేందుకు చేసిన కృషి ఫలించింది. పండుగ రోజు ఉదయాన్నే సూపర్‌వైజర్లు, సిబ్బంది రోడ్లపైకి వచ్చి ప్రైవేటు కార్లు, జీపులు, ఆటోలు రాకుండా కట్టుదిట్టం చేసి ప్రయాణికులందరినీ ఆర్టీసీ బస్సులో ఎక్కేలా ప్రోత్సహించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం కావడంతో ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపారు.

హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వచ్చే నానస్టా్‌పలు, మిర్యాలగూడ, కోదాడ, నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఒక్కో నానస్టా్‌ప బస్సుకు ఇద్దరు కండక్టర్లకు టిమ్స్‌ మిషన్లు ఇచ్చి నిమిషాల్లో టికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి బస్సులు జాం కాకుండా, ప్రయాణికులు చికాకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అత్యధిక ఆదాయాన్ని నల్లగొండ రీజియన సాధించిందని సిబ్బంది తెలిపారు. రాష్ట్రంలోనే నల్లగొండ రీజియన 122శాతం ఓఆర్‌తో మొదటి స్థానంలో నిలవడంతో రీజియన అధికారులకు సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సెలవు పెట్టని మహిళా ఉద్యోగులు

వాస్తవానికి రాఖీ పండుగ రోజు మహిళా కండక్టర్లు, ఉద్యోగులు సెలవులు పెట్టి పండుగకు వెళ్తుంటారు. అయితే నల్లగొండ రీజియనలో సుమారు 500 మంది మహిళా ఉద్యోగులు, కండక్టర్లు సిబ్బంది, సం స్థ అభ్యున్నతి కోసం పనిచేయడం విశే షం. మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజు కూడా పనిచేయడం తో వారందరినీ సంస్థ ఉన్నతాధికారులు అభినందించారు. అధికారిక లెక్కల ప్రకారం మహాలక్ష్మి పథకం కింద మహిళలు సుమారు 6.50 లక్షల మంది ప్రయాణించగా పురుష ప్రయాణికులు సు మారు 3.50 లక్షల మంది ప్రయాణించారు. అత్యధికంగా కిలోమీటర్ల ప్రయాణ విషయంలో సూర్యాపేట డిపో 1,84,530 కిలోమీటర్లు బస్సులను నడిపి మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మిర్యాలగూడ డిపో పరిధిలో 1,51,620 కి.మీలు ప్రయాణించగా, నల్లగొండ డిపో పరిధిలో 1,50,823 కి.మీలు ప్రయాణించి మూడో స్థానంలో నిలిచింది. దేవరకొండ డిపో పరిధిలో 1,43,676 కిలోమీటర్లు బస్సులు ప్రయాణం చేశా యి. కోదాడ డిపో పరిధిలో 1,14,422 కిలోమీటర్లు, యాదగిరిగుట్ట డిపో పరిధిలో 1,21,881 కిలోమీటర్లు, అత్యంత తక్కువగా నార్కట్‌పల్లి డిపో పరిధిలో 22,395 కిలోమీటర్ల దూరం బస్సులు ప్రయాణించాయి.

మూడు రోజుల్లో డిపోల వారీగా ఆదాయం ఇలా...

డిపో ఈ ఏడాది గతేడాది

ఆదాయం (లక్షల్లో)

దేవరకొండ 127.88 1,74,213

నల్లగొండ 102.61 1,65,340

నార్కట్‌పల్లి 19.98 30,341

మిర్యాలగూడ 101.84 1,51,411

యాదగిరిగుట్ట 86.34 1,41,507

కోదాడ 76.85 1,13,760

సూర్యాపేట 140.73 1,99,716

మొత్తం 656.25 6,46,63,000

ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారు

ఉద్యోగుల సమష్టి కృషితో రాఖీ పండుగ రోజు రీజియనకు అదనపు ఆదా యం లభించింది. ఉద్యోగులందరికీ పేరుపేరున ధన్యవాదాలతో పాటు అభినందనలు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతీ ఒక్క ఉద్యోగి, అధికారి కృషి చేసి ఆర్టీసీని ఆదాయంతో ముందుకు నడిపించాలి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడంతో పాటు ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల భద్రత కూడా ఉంటుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఆర్టీసీ సిబ్బంది రాఖీ పండుగకు సెలవులు పెట్టకుండా పనిచేయడం ఎంతో సంతోషకరమైన విషయం.

- కె.జానరెడ్డి, ఆర్‌ఎం, నల్లగొండ

Updated Date - Aug 12 , 2025 | 12:58 AM