Raja Singh Challenge: ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:12 AM
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాటల తూటాలు పేల్చారు. ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిజీ..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ మాటల తూటాలు
అఫ్జల్‌గంజ్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాటల తూటాలు పేల్చారు. ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిజీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? జూబ్లీ హిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తారా? కాంగ్రె్‌సను గెలిపిస్తారా..? అని సోషల్ మీడియాలో మిమ్మల్ని జనాలు అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉందా ?’ అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘భారీ ఓట్లతోని ఓడిపోతే కేంద్ర పెద్దలకు మల్లా మీ ముఖం ఎట్లా చూపెడతారు? కొద్దిగా ఆలోచన చేసినారా మా సారు. మీకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రతి ఒక్క డివిజన్‌లో మేలు చేసే అలవాటు ఉన్నది. ఇవాళ మీ జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపించారు. మీరు కూడా ఏదో ఒకరోజు వెళ్తారు పక్కా’ అంటూ కిషన్ రెడ్డిపై రాజాసింగ్ మరోసారి ఆరోపణలు చేశారు.