Share News

kumaram bheem asifabad- పలు చోట్ల వర్షం

ABN , Publish Date - Oct 04 , 2025 | 10:52 PM

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో శనివారం 44.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది

kumaram bheem asifabad- పలు చోట్ల వర్షం
చింతలమానేపల్లిలో ఉప్పొంగి ప్రవహిస్తున్న దిందా వాగు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో శనివారం 44.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. కాగజ్‌నగర్‌ మండలంలో అత్యధికంగా 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెంచికలపేట్‌లో 40.0 రెబ్బెనలో 27.0, దహెగాంలో 21.8, ఆసిఫాబాద్‌లో 8.3, తిర్యాణిలో 7.8, కెరమెరిలో 7.5, జైనూరులో 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

కాగజ్‌నగర్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చింది. ఆయా వార్డుల్లో అంతర్గత రోడ్లు బురదమయంగా మారాయి.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కేతిని-దిందా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాక పోకలు నిలిచి పో యాయి. అయితే భారీ వర్షం కారణంగా పంటలు తీవ్ర దెబ్బతినే అవకాశం ఉందని, తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు తెలిపారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు పొంగి పొర్లాయి. పత్తి రైతులు వర్షాలు నష్టాలు కలుగజేసే అస్కారం ఉందని ఆందోళన చెందుతున్నారు. పగిలిన పత్తి తడిసి ముద్ద అయి కొంత రావాలి పోయే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంకురిసింది. మండల కేంద్రంలో వార సంత కావడంతో భారీ వర్షానికి ప్రజలు, వ్యాపారులు అవస్థలు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంతకు వచ్చి వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురువడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Oct 04 , 2025 | 10:52 PM