Railway Ticket Fines: టికెట్ తనిఖీలతో ఒకే రోజు 1.08కోట్ల ఆదాయం
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:54 AM
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సోమవారం విస్తృత స్థాయిలో టికెట్ తనిఖీలు నిర్వహించగా 16,105మంది పట్టుబడ్డారు. వీరిపై మొత్తంగా...
జోన్ చరిత్రలో రికార్డు.. 16,105 మందికి జరిమానాలు
హైదరాబాద్, అక్టోబర్ 14(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సోమవారం విస్తృత స్థాయిలో టికెట్ తనిఖీలు నిర్వహించగా 16,105మంది పట్టుబడ్డారు. వీరిపై మొత్తంగా రూ.1.08కోట్ల జరిమానా విధించి వసూలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలోనే ఒక్కరోజులో ఇంత జరిమానా విధించి వసూలు చేయడం ఇదే మొదటిసారి. ఇందులో విజయవాడ డివిజన్‌లో అత్యధికంగా రూ.36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్‌లో రూ.28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్‌లో రూ.27.9 లక్షలు, గుంటూరు డివిజన్‌లో రూ.6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్‌లో రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్‌లో రూ.4.08 లక్షల ఫైన్ వసూలు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణ రోజుల్లో నిర్వహించే తనిఖీల్లో ఫైన్‌ల ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.47 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని తెలిపింది.