Rahul Gandhi Arrives in Hyderabad Today: నేడు హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:52 AM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రభుత్వ....
రాత్రి ఉప్పల్ స్టేడియంలో గోట్ ఇండియా టూర్‌కు హాజరు
తిరిగి రాత్రి 10.30 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న కాంగ్రెస్ నేత
హైదరాబాద్, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రభుత్వ వర్గాలు శుక్రవారం విడుదల చేశాయి. రాహుల్‌గాంధీ శనివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 4:15 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5:00 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు రోడ్డు మార్గంలో వస్తారు. రాత్రి 7:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, 7:55 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ ేస్టడియంకు చేరుకుంటారు. అక్కడ జరిగే ‘గోట్ ఇండియా టూర్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 9:45 గంటలకు తిరిగి విమానాశ్రయానికి చేరుకుని, రాత్రి 10:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారని అధికారులు తెలిపారు.