Ragging Incident: కొందుర్గు గురుకుల పాఠశాలలో ర్యాగింగ్
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:42 AM
రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు..
నోట్లో పేపర్ కుక్కి.. శరీరానికి గాట్లు
కొందుర్గు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు సహచర విద్యార్థులు గురువారం రాత్రి దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్లు వినకపోతే బాగుండని బెదిరింపులకు దిగారని విద్యార్థి తెలిపాడు. అందుకు నిరాకరించడంతో.. హాస్టల్ గదిలో కరెంట్ బంద్ చేసి, నోట్లో పేపరు ముక్కలు కుక్కి ఒంటిపై గాట్లు పెట్టినట్లు వాపోయాడు. మర్నాడు తనపై జరిగిన దాడిని ప్రిన్సిపాల్ కుర్షీద్‌కు వివరించాడు. కాగా, ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు కొందుర్గు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.