Share News

Medical Student: వైద్య విద్యార్థులందరికీ రేబిస్‌ చికిత్సపై శిక్షణ

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:27 AM

భారత్‌ను 2030 నాటికి రేబిస్‌ రహిత దేశంగా చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ స్థాయి కార్యాచరణను సిద్ధం చేసిన....

Medical Student: వైద్య విద్యార్థులందరికీ రేబిస్‌ చికిత్సపై శిక్షణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భారత్‌ను 2030 నాటికి రేబిస్‌ రహిత దేశంగా చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ స్థాయి కార్యాచరణను సిద్ధం చేసిన ప్రభుత్వం వైద్య కళాశాలలకు కీలక బాధ్యతలు అప్పగించింది. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ కుక్క కాటు నిర్వహణ, రేబిస్‌ చికిత్సపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) వైద్య కళాశాలలకు ఇటీవల ఓ అడ్వయిజరీ పంపింది. విద్యార్థులకు రేబిస్‌ చికిత్సపై శిక్షణ ఇవ్వాలని, యాంటీ రేబిస్‌ టీకా, యాంటీ రేబిస్‌ సీరం బోధనాస్పత్రుల్లో నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. అలాగే, ప్రతీ వైద్య కళాశాల కుక్క కాటు కేసులపై ఓ రిజిష్టర్‌ను నిర్వహించాలని, రేబిస్‌ అనుమానిత కేసులను రాష్ట్ర ఆరోగ్యశాఖ నోడల్‌ అధికారికి తెలియజేయాలని పేర్కొంది.

Updated Date - Sep 18 , 2025 | 06:27 AM