Rabi Crop Cultivation: 5.60 లక్షల ఎకరాలకు యాసంగి సాగు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:25 AM
రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం 5.60 లక్షల ఎకరాలకు చేరుకుంది. వరినాట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా..
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం 5.60 లక్షల ఎకరాలకు చేరుకుంది. వరినాట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.. మొక్కజొన్న, వేరుశనగ, శనగ పంటల విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణంలో సుమారు 40 శాతానికి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ బుధవారం సాగు నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం.. యాసంగి సీజన్‌లో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 68,67,407 ఎకరాలు కాగా... ఇప్పటివరకు 5,60,456 ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. నిరుటితో పోలిస్తే వరినాట్లు కాస్త ముందస్తుగానే మొదలయ్యాయి.