Share News

Komatireddy Venkat Reddy: అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:08 AM

రోడ్డు, భవనాల శాఖలో ఎప్పుడూ లేనివిధంగా పదోన్నతులు, బదిలీలను చేసుకున్నామని.. అధికారులు, ఇంజనీర్లు ఉత్సాహంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

Komatireddy Venkat Reddy: అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

  • ఆర్‌ అండ్‌ బీ శాఖపై సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రోడ్డు, భవనాల శాఖలో ఎప్పుడూ లేనివిధంగా పదోన్నతులు, బదిలీలను చేసుకున్నామని.. అధికారులు, ఇంజనీర్లు ఉత్సాహంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మంగళవారం ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బీ కేంద్ర కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.


హ్యామ్‌ రోడ్లు పది ప్యాకేజీలకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈఎన్సీ జయభారతిని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ అండ్‌ బీ శాఖకు నిధుల విడుదలపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆర్వోబీలు, మెడికల్‌ కాలేజీలు, టిమ్స్‌ ఆస్పత్రులు, కలెక్టరేట్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

Updated Date - Jul 02 , 2025 | 05:08 AM