Share News

నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 13 , 2025 | 11:19 PM

రైౖతుల వద్ద నుంచినాణ్యమైన ధా న్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం చెన్నూరు మండలంలోని కత్తెరసాల, దుగ్నేపల్లి, అంగ్రాజ్‌పల్లి, సుందరశాల, బావురావుపేట, కిష్టంపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంద ర్శించారు.

నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, మే 13 (ఆంధ్రజ్యోతి) : రైౖతుల వద్ద నుంచినాణ్యమైన ధా న్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం చెన్నూరు మండలంలోని కత్తెరసాల, దుగ్నేపల్లి, అంగ్రాజ్‌పల్లి, సుందరశాల, బావురావుపేట, కిష్టంపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంద ర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్‌ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ధాన్యం విక్ర యించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించాలని, ధాన్యం విక్రయిం చిన రైతులకు రశీదు అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం కేటాయించిన ప్రకారం ట్యాగింగ్‌ చేయబడిన రైసుమిల్లులకు తరలించాలని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:19 PM