Share News

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:27 PM

రైతులు తాలు తప్ప లేని నాణ్య మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో యాసంగి వరిధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు.

నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి

అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌

జైపూర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : రైతులు తాలు తప్ప లేని నాణ్య మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో యాసంగి వరిధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికోతల సమయంలో దగ్గరలోనే ఉంది కాబట్టి రైతులు పూర్తి పరిపక్వత చెంది గింజ, ఆకులు లేత పసుపు రంగుకు మారిన తర్వాతనే కోతలు చేపట్టా లని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే ధాన్యం నిర్ధిష్ట నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలన్నారు. రైతులు ధాన్యంతో పాటు పట్టాపాస్‌ బుక్‌, ఆధార్‌, బ్యాంకు పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీలను ఇవ్వా ల న్నారు. దొడ్డు వడ్లు గ్రేడ్‌ ఏ రకానికి రూ. 2320, గ్రేడ్‌ బీ ధాన్యంకు రూ.2300, క్వింటాలుకు మద్దతు ధరతో పాటు సన్నబియ్యంకు రూ. 500 బోనస్‌ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో చెన్నూరు ఏ డీఏ ప్రసాద్‌ నాయక్‌, తహసీల్దార్‌ వనజారెడ్డి, వ్యవసాయాధికారి మా ర్క్‌గ్లాడస్ట్‌న్‌, ఏపీఎం రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:27 PM