Minister Adluri: హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:47 AM
ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు...
అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలి: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యత, సరఫరాపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి సబ్యసాచి ఘోష్, వివిఽధ శాఖల కార్యదర్శులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. హాస్టళ్లకు నాణ్యత కలిగిన ఆహార పదార్థాలు, ఇతర సరుకులు సరఫరా చేసేలా చూడాలని, అవన్నీ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్ల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.