kumaram bheem asifabad- వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:01 PM
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ టి మధుసూదన్ అన్నారు. చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్ అశోక్‌తో కలిసి జిల్లాలోని విద్యుత్ శాఖాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ టి మధుసూదన్ అన్నారు. చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్ అశోక్‌తో కలిసి జిల్లాలోని విద్యుత్ శాఖాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, అవసరమైన అన్ని రకాల పరికరాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల ఫెయిల్యూర్స్ తగ్గించడానికి మెయింటైనెన్స్ చేపట్టాలని, అన్ని లైన్లు, ట్రాన్స్ఫార్మర్‌లు పరీక్షించి ప్రమాదకారక ప్రాంతాలు గుర్తించి వాటిని సరి చేసేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగులు పని చేసేటప్పు డు అన్ని రకాల భద్రత పరికరాలు ఉపయోగిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ శేషారావు, డీఈఈ, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, అకౌంట్ అధికారులు