విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:12 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత ప్రతీ ఉపాధ్యాయుడిపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి రమే శ్ కుమార్ అన్నారు.
- జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్
వెల్దండ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత ప్రతీ ఉపాధ్యాయుడిపై ఉందని జిల్లా విద్యాశాఖాధికారి రమే శ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నతపాఠశాల, ఎమ్మార్సీ ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందించాలన్నారు. సులభతరమైన భోదనతోనే విద్యార్థుల్లో విద్యపట్ల ఆసక్తి పెరుగుతుందని సూచించారు. వచ్చే వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని డీఈవో సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పావని, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ఉన్నారు.