kumaram bheem asifabad- నాణ్యమైన విద్య అందించాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:08 PM
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహరం అందించాలని కలెక్టర్ వెంకటేష్ దో త్రే అన్నారు. మండలంలోని గన్నారం జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు
కాగజ్‌నగర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహరం అందించాలని కలెక్టర్ వెంకటేష్ దో త్రే అన్నారు. మండలంలోని గన్నారం జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహరం అందించాలన్నారు. శుద్ధమైన తాగునీరు అందించాలని, విద్యార్థుల హాజరు శాతంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాని సూచించారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలపై ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మంతు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.