Share News

kumaram bheem asifabad- నాణ్యమైన విద్యను అందించాలి

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:24 PM

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఇంటర్మీడియేట్‌ బోర్డు అధికారి యాదగిరి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- నాణ్యమైన విద్యను అందించాలి
సిర్పూర్‌ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులతో మాట్లాడుతున్న ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి యాదగిరి

కాగజ్‌నగర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఇంటర్మీడియేట్‌ బోర్డు అధికారి యాదగిరి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు పాటుపడాలని సూచించారు.. కళాశాలలో నెలకొన్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, ఇంటర్మీడియేట్‌ జిల్లా విద్యాధికారి కళ్యాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి యాదగిరి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అడ్మిషన్‌ అయిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లు అయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఈవో కల్యాణి, ప్రిన్సిపాల్‌ తిరుపతి, అధ్యాపకులు ఆసీఫ్‌, తిరుపతి తదితరులు ఉన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి యాదగిరి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు, హాజరు శాతం సౌకర్యాలపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రామదాసును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ రాందాస్‌, అధ్యాపకులు చంద్రయ్య, కిరణ్‌కుమార్‌, సంతోష్‌, శ్రీధర్‌, తిరుపతి, సురేందర్‌కుమార్‌, జాకీర్‌, అర్చన తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:24 PM