ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యాబోధన
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:58 PM
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్య మైన విద్యాబోధన ఉంటుందని ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని జిల్లా విద్యాధికారి యాదయ్య తెలి పారు. పట్టణంలోని ఒర్రగడ్డ జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం హైదరా బాద్‌కు చెందిన సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెంచీల పంపిణీకి ముఖ్య అ తిథిగా హాజరయ్యారు.
డీఈవో యాదయ్య
మందమర్రిటౌన్, జూలై3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్య మైన విద్యాబోధన ఉంటుందని ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని జిల్లా విద్యాధికారి యాదయ్య తెలి పారు. పట్టణంలోని ఒర్రగడ్డ జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం హైదరా బాద్‌కు చెందిన సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెంచీల పంపిణీకి ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రాథ మిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు బుక్సు ఉచితంగా అందజేస్తూ విద్యార్థుల ఉన్నతికి దోహదపడు తుందన్నారు. పాఠశాల ప్రధానోపాద్యాయురాలు పద్మజ బాధ్యతలు స్వీక రిం చిన తరువాత పాఠశాల రూపురేఖలు మారిపోయాయన్నారు. పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య కూడ పెద్ద మొత్తంలో పెరిగిందన్నారు. మందమర్రి జీఎం దే వేందర్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ విద్యతోనే విజ్ఞానం పె రగడంతో పాటు ప్రతి విద్యార్థి ఉన్నతస్థాయిలో ఉంటాడని పేర్కొన్నారు. మ ధ్యాహ్నం భోజనం లాంటి పథకం కూడ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుం దని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు బ్లూడాన్ ఆర్గనైజేషన్ వారు బెంచీలు అందజేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం బెంచీలను పాఠశాలకు సంస్థ నిర్వాహకులు విదుమౌళి, శ్రీకాంత్, స్థానిక ఎంఈవో దత్తుమూర్తి పంపి ణీ చేశారు. కాగా ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు పాల్గొన్నారు.
మెరుగైన విద్య అందించాలి
కన్నెపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యనందిం చా లని డీఈవో యాదయ్య సూచించారు. గురువారం మండలంలోని ఐతపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామ ర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందాయా అ ని ఉపాధ్యాయులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు వి ద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా పాఠాలను బోధించాలన్నారు. మె ను ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిం చాలన్నారు.