Share News

kumaram bheem asifabad- ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:22 PM

విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శుక్రవారం జిల్లాలోని బూర్గుడ గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌ స్థాయి అక్షరాభ్యాస కార్యక్రమా నికి హాజరై నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు

kumaram bheem asifabad- ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శుక్రవారం జిల్లాలోని బూర్గుడ గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌ స్థాయి అక్షరాభ్యాస కార్యక్రమా నికి హాజరై నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి రోజు క్రమం తప్పకుండా విద్యార్థులను పాఠశాలలకు పంపించాలన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌పుస్తకాలు, ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పోషకాహార విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులు ఎస్‌ఎల్‌ఎన్‌ పద్ధతిన బోధన అందుతుందని తెలిఊపపారు. అనంతరం కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు సమకూర్చిన బ్యాగ్‌లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో ఆర్డనేటర్‌ శ్రీనివాస్‌, ఎంఈవో సుభాష్‌, ప్రధానోపాధ్యా యుడు సదాశివ్‌, తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శివచరణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అర్జుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నటరాజ్‌, ధర్మబాయి, సీఆర్పీ సందీప్‌, అంగన్‌వాడీ టీచర్‌ లక్ష్మి, ఊష, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, జగదీష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): బడిబాటలో భాగంగా కెరమెరి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టినట్లు ఎంఈవో ప్రకాష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పర్దాన్‌గూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాములు, ఎస్‌సీఈఆర్పీ వెంకటేశ్వరు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:22 PM