kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన విద్య
ABN , Publish Date - Dec 16 , 2025 | 10:57 PM
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యఅందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంట శాల, సామాగ్రి నిల్వ చేసిన గది, నిత్యావసర సరుకుల నాణ్యత, మెనూ అమలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యఅందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంట శాల, సామాగ్రి నిల్వ చేసిన గది, నిత్యావసర సరుకుల నాణ్యత, మెనూ అమలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పరభుత్వ పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, అదనపు గదులు, ప్రహారి గోడ ఇతర మౌలిక దుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ పౌషిటక ఆమారంతో కూడిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం తారీలో పరిశుభ్రత నిబంధనలను పాటించడంతో పాటు ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగిం చాలని, విద్యార్థులకు శుద్ధమైన నీటిని అందించాలని తెలిపారు. మెనూ ప్రకారం సకాలంలో పోషన విలువలు కలిగిన రుచికరమైన ఆహారం అందించాలని చెప్పారు. నిత్యావసర సరుకులు భద్రత పరిచే గది పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందంచాలని సూచించారు. తరగతిలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
ఓటర్లకు అసౌకర్యం కలుగొద్దు
రెబ్బెన, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరుగన్ను మూడో విడత ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కాగజ్‌నగర్ మండలం రాజంపేటలలో ఏర్పాటు చేసిన మండలంలో విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లాలోని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడతలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాలల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు, విద్యుత్, తాగునీరు, ర్యాంపు సదుపాయాలను కల్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయిం చిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ఆయన వెంట అధికారులు తదితరులు ఉన్నారు.