QR Code Ticket Booking: క్యూఆర్ కోడ్‌తోనే టికెట్ల కొనుగోలు!
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:37 AM
పండుగ సీజన్ కారణంగా రైల్వే స్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ చేయని జనరల్ బోగిల్లో ప్రయాణించే వారి కోసం...
పండగ సీజన్‌లో రైల్వే శాఖ నూతన ఆలోచన
త్వరలో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేత?
స్మార్ట్ ఫోన్లు లేని ప్రయాణికులకు ఇబ్బందులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): పండుగ సీజన్ కారణంగా రైల్వే స్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ చేయని జనరల్ బోగిల్లో ప్రయాణించే వారి కోసం క్యూఆర్ కోడ్ స్కానర్లను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. యూటీఎస్ అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు క్యూలైన్లలో వేచిచూసే అవసరం లేకుండా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. రైల్వే సిబ్బంది ధరించే జాకెట్‌పై క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ముద్రించి ఉంటాయి. ఈ జాకెట్ ధరించి ఉన్న సిబ్బంది వద్ద నుంచి చేతిలో డబ్బు లేకపోయినా టికెట్ కొనచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్-వాలెట్ ద్వారా టికెట్లు కోనుగోలు చేస్తే 3 శాతం బోనస్ లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రజల్లో కొత్త విధానంపై అవగాహన కల్పించి త్వరలో టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసివేయాలని అధికారులు భావిస్తున్నారు. వాటి స్థానంలో క్యూఆర్ కోడ్ లేదా ఏటీవీఎం(ఆటోమేటెడ్ వెండర్ మెషీన్) యంత్రాలను ఉపయోగించాలని పదే పదే కోరుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నాందేడ్ రైల్వే స్టేషన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి మొదలైన ఈ కొత్త పద్ధతితో చేతిలో స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా