Share News

Heart Rhythm Disorder: గుండె లయ రుగ్మతలకు క్యూ డాట్‌ చికిత్స!

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:15 AM

క్రమరహిత హృదయ స్పందనలతో బాధపడుతున్న ఓ మహిళకు అత్యాధునిక క్యూ డాట్‌ చికిత్స ద్వారా బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి వైద్యులు ఉపశమనం కల్పించారు...

Heart Rhythm Disorder: గుండె లయ రుగ్మతలకు క్యూ డాట్‌ చికిత్స!

  • 57 ఏళ్ల మహిళకు విజయవంతంగా నిర్వహించిన బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): క్రమరహిత హృదయ స్పందనలతో బాధపడుతున్న ఓ మహిళకు అత్యాధునిక ‘క్యూ డాట్‌’ చికిత్స ద్వారా బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి వైద్యులు ఉపశమనం కల్పించారు. గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం (ఆట్రియల్‌ ఫైబ్రిలేషన్‌ అబ్లేషన్‌)తో బాధపడుతున్న 57 ఏళ్ల మహిళకు క్యూ డాట్‌ సాంకేతికత ద్వారా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశామని కేర్‌ ఆస్పత్రి కార్డియాక్‌ ఎలక్ర్టోఫిజియాలజీ క్లినికల్‌ డైరెక్టర్‌ రామకృష్ణ ఎస్వీకే తెలిపారు. బుధవారం ఆస్పత్రిలో ఆయన మాట్లాడుతూ.. క్యూ డాట్‌ రాక దేశంలో గుండె దడ చికిత్సలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పారు. ఈ అత్యాధునిక ఎలకో్ట్రఫిజియాలజీ పద్ధతిని ఉపయోగించిన ఆస్పత్రుల్లో ఒకటిగా కేర్‌ నిలిచిందన్నారు. దీర్ఘకాలిక అరిథ్మియాతో బాధపడుతున్న రోగులకు ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోందని.. శస్త్రచికిత్స తర్వాత ఆమె గుండె లయ సాధారణ స్థాయికి వచ్చిందని వివరించారు.

Updated Date - Nov 13 , 2025 | 05:15 AM