PV Veterinary University: 19న పీవీ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:53 AM
పీవీ నర్సింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవాన్ని ఈనెల 19న నిర్వహించునున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్...
అక్టోబరు 7న హెచ్‌సీయూ 25వ స్నాతకోత్సవం
రాజేంద్రనగర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పీవీ నర్సింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవాన్ని ఈనెల 19న నిర్వహించునున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.జ్ఞానప్రకాశ్ తెలిపారు. బుధవారం వర్సిటీ పరిపాలన భవనంలో ఆయన మాట్లాడుతూ, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో జరిగే ఈ స్నాతకోత్సవంలో 2023 జనవరి 1 నుంచి 2024 డిసెంబరు 31 వరకు కోర్సులు పూర్తి చేసిన 524 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. వీరితో పాటు వివిధ కోర్సులలో ప్రతిభావంతులైన 25 మందికి బంగారు పతకాలు అందజేస్తామని ఎం.జ్ఞానప్రకాశ్ తెలిపారు. అలాగే, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) 25వ స్నాతకోత్సవాన్ని అక్టోబరు 7న నిర్వహించనున్నారు. హైదరాబాద్- గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరగనున్న కార్యక్రమంలో వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన 1,700 మంది విద్యార్థులకు యూజీ, పీజీ, పీహెచ్‌డీ డిగ్రీలను, బంగారు పతకాలను ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. స్నాతకోత్సవంలో వ్యక్తిగతంగా డిగ్రీలు అందుకోవాలనుకునే విద్యార్థులు 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.