Share News

నిబంధనలకు లోబడి కొనుగోళ్లు చేయాలి

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:10 PM

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి వరిధాన్యం, పత్తి కొనుగోలు చేస్తుందని, అధికారులు రైతుల కు లబ్ది చేకూరేలా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయా లని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం తాం డూర్‌ మండల కేంద్రంలోని మహేశ్వరి కాటన్స్‌ జిన్నింగు మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారం భించారు.

నిబంధనలకు లోబడి కొనుగోళ్లు చేయాలి

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

తాండూర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి వరిధాన్యం, పత్తి కొనుగోలు చేస్తుందని, అధికారులు రైతుల కు లబ్ది చేకూరేలా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయా లని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం తాం డూర్‌ మండల కేంద్రంలోని మహేశ్వరి కాటన్స్‌ జిన్నింగు మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 3 జిన్నింగు మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో వివరాలను న మోదు చేసుకుని పత్తి విక్రయానికి స్లాట్‌ బుక్‌ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నిబంధ నల ప్రకారం పత్తిలో తేమ శాతం, ఇతర అంశాలను పరిగ ణలోకి తీసుకుని రైతుల వద్ద నుంచి పత్తి కొనాలన్నారు. ఆ ధార్‌ నెంబర్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, ఆధార్‌ కార్డులో ఫొ టో కలిగి ఉన్న రైతు మాత్రమే తక్పట్టిలో ఫొటో దిగాల్సి ఉంటుందన్నారు. క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేసిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, మండల వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణ అధికారుల సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దళారులు కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి అనుమతిం చకూడదని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, మార్కెటింగ్‌ అధికారి షాహబొద్దీన్‌, తహసీల్దార్‌ జ్యోత్స్న, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు

Updated Date - Nov 03 , 2025 | 11:10 PM