కొనుగోళ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలి
ABN , Publish Date - May 10 , 2025 | 11:22 PM
రానున్న రెండు రోజుల్లో ధాన్యం కొను గోళ్లను పూర్తి చేసి సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్స్‌కు తరలించి ఽసెంటర్‌ను మూసి వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకుల కు సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్
లక్షెట్టిపేట, మే 10(ఆంధ్రజ్యోతి): రానున్న రెండు రోజుల్లో ధాన్యం కొను గోళ్లను పూర్తి చేసి సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్స్‌కు తరలించి ఽసెంటర్‌ను మూసి వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకుల కు సూచించారు. శనివారం అడిషనల్ కలెక్టర్ మున్సిపాలిటీలోని ఇటిక్యాల మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మార్వో దిలీప్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు పూర్తి కావడంతో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లతో పాటు మిల్లుకు తరలించిన ధాన్యం వివరాలు అదే వి ధంగా ఇంకా తూకం వేయాల్సిన ధాన్యం వివరాలను కేంద్రం నిర్వహకుడు కోల పురుషోత్తం అధికారులకు వెల్లడించారు. ఈసందర్భంగా అడిషనల్ క లెక్టర్ మాట్లాడుతూ ఈసెంటర్‌లో ఇప్పటి వరకు 15200క్వింటాళ్ల ధాన్యం రై తుల నుంచి సేకరించామని అందులో 14700క్వింటాళ్ల ధాన్యం బస్తాలను కే టాయించిన రైస్‌మిల్లుకలు పంపించారని ఇంకా సుమారు 4వందల క్వింటా ళ్ల ధాన్యం మిల్లుకు తరలించాలన్నారు. ఈసెంటర్‌లో ఇంకా 600క్వింటాళ్ల ధాన్యం తూకం వేయాల్సి ఉందని అది సోమవారం వరకు పూర్తి చేసి కేం ద్రం మూసేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతే కాకుండా పరిస్థి తుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల శ్రేయస్సు కోసం రెండవ శనివా రం సెలవు దినం ఉండి కూడా కొనుగోలు కేంద్రంలో విధులు చేస్తున్న ప్రతీ ఒక్కరిని అభినందించారు.