Polio Drops: 16.35 లక్షల మంది పిల్లలకు పల్స్ పోలియో
ABN , Publish Date - Oct 13 , 2025 | 08:11 AM
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది.
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ 6 జిల్లాల పరిధిలో 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 17,56,789 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అందులో 16,35,432 మంది పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేశామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ ప్రకటించారు. మిగిలిన పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివారం వ్యాక్సిన్ వేయించుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తారని కమిషనర్ తెలిపారు.