Share News

kumaram bheem asifabad- పూలాజీ బాబా జయంతిని ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 10:44 PM

జిల్లాలో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఈ నెల 30న జైనూర్‌ మండలం పట్నాపూర్‌లో గల పూలాజీ బాబా సంస్థాన్‌లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- పూలాజీ బాబా జయంతిని ఘనంగా నిర్వహించాలి
: కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఈ నెల 30న జైనూర్‌ మండలం పట్నాపూర్‌లో గల పూలాజీ బాబా సంస్థాన్‌లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 30న పాట్నాపూర్‌లో నిర్వహించే పూలాజీ బాబా జయంతి వేడుకలను అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు సమష్టగా కృషి చేసి విజయవంతం చేయాలని తెలిపారు. భక్తులకు, ప్రబుఖులకు, వాహన పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వాహనాలు ఒకే వరులో వెళ్లే విధంగా పోలీసు శాఖ అధికారులు రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకోవలని తెలిపారు. రోడ్లపై గుంతల్లో మొరం పోసి చదును చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో పూలాజీ బాబా తనయుడు కేశవరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌, విద్యుత్‌ శాఖ ఈఈ శేషరావు, డీపీఓ భిక్షపతి, డీఎంహెచ్‌వో సీతారాం, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దిక్‌, సీఐ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా పింఛన్ల పంపిణీ

ఆసిఫాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులకు పింఛన్లు పారదర్శకంగా అందజేస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి మంగళవారం బ్రాంచి పోస్టు ఆఫీసర్‌లకు మొబైల్స్‌ అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్‌లో ప్రత్యేకంగా యాప్‌ ఉంటుందని చెప్పారు. పెన్షన్‌దారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుం దన్నారు. ప్రతి నెలా పెన్షన్‌దారులకు ఐరీష్‌, వేలిముద్ర ద్వారా పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి

కాగజ్‌నగర్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌ నవోదయ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన అతిఽధి గృహాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చక్కటి లక్ష్యాలను చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలన్నారు. తద్వార ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశాలుంటన్నాయి. ప్రణాళికాబద్ధంగా చదుకోవాలని చెప్పారు. పట్టుదలతో చదివితే గొప్ప భవిష్యత్తు ఉంటుందని సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్దా శుక్లా, ఇన్‌చార్జి డీఈఓ ఉదయ్‌ బాబు, ప్రిన్సిపాల్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాగజ్‌నగర్‌ పెద్దవాగును మంగళవారం జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచలను సిబ్బందికి వివరించారు. అలాగే పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌ మధూకర్‌, ఎంపీడీఓ కోట ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 10:44 PM